Brother Married Sister : సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న!

ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద డబ్బు రావాలనే దురాశతో ఓ యువకుడు తన చెల్లినే(బాబాయ్ కూతురిని) వివాహం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని

Brother Married Sister : సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న!

Up

Updated On : December 15, 2021 / 5:35 PM IST

Brother Married Sister : ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద డబ్బు రావాలనే దురాశతో ఓ యువకుడు తన చెల్లినే(బాబాయ్ కూతురిని) వివాహం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌ జిల్లాలోని తుండ్లాలో శనివారం ఈ ఘటన జరిగింది.

శనివారం తుండ్ల బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి సామూహిక కళ్యాణోత్సవం నిర్వహించారు. ఇందులో 51 జంటలు వివాహం చేసుకున్నాయి. వీరందరికీ పెళ్లి ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఈ వేడుకలో వివాహ బంధంతో ఒక్కటైన జంటలకు గృహోపకరణాలు, దుస్తులు, ఇతర నిత్యావసరాలను అందించారు. ఈ వేడుకలోని కొందరు జంటల వీడియోలు, ఫొటోలు స్థానికంగా ప్రచారం కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫొటోలు చూసిన గ్రామ పెద్దలు.. మొత్తం నాలుగు ఫోర్జరీ కేసులు ఉన్నట్టుగా గుర్తించారు. అందులో ఓ యువకుడు తన సోదరినే పెళ్లి చేసుకన్నట్టుగా గుర్తించారు.

దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ అన్న, చెల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహాలు నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగి.. గ్రామస్థాయి అధికారులపై చర్యలు ప్రారంభించారు. జంటల వివాహాన్ని ధృవీకరించిన అధికారులకు నోటీసు పంపారు. డబ్బుల కోసం చెల్లిని పెళ్లాడిన యువకుడిపై కేసు నమోదు చేశారు. వారికి అందించిన గృహోపకరణాలు తిరిగి తీసుకున్నారు.

బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి నరేష్‌కుమార్‌ మాట్లాడుతూ…గ్రామ పంచాయతీ కార్యదర్శి మారసేన కుశాల్‌పాల్‌, గ్రామపంచాయతీ ఘిరోలి కార్యదర్శి అనురాగ్‌ సింగ్‌, ఏడీవో కోఆపరేటివ్‌ సుధీర్‌కుమార్‌, సాంఘిక సంక్షేమశాఖ ఏడీవో చంద్రభాన్‌సింగ్‌, నకిలీ వివాహాలను వెతికి పట్టుకున్న వారి నుంచి దీనిపై వివరణ కోరినట్లు తెలిపారు. సంతృప్తికరమైన వివరణ రాకుంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటారు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు

ALSO READ Rampur Royal Property:వార‌స‌త్వ సంపద కోసం 50 ఏళ్లు పోరాటం..రూ.2,650 కోట్ల ఆస్తిని దక్కించుకున్న న‌వాబుల వారసులు