Rampur Royal Property:వార‌స‌త్వ సంపద కోసం 50 ఏళ్లు పోరాటం..రూ.2,650 కోట్ల ఆస్తిని దక్కించుకున్న న‌వాబుల వారసులు

వార‌స‌త్వ సంపద కోసం 50 ఏళ్లు పోరాటం చేసి ఎట్టకేలకు రూ.2,650 కోట్ల ఆస్తిని దక్కించుకున్న రాంపూర్తి న‌వాబుల వారసులు.

Rampur Royal Property:వార‌స‌త్వ సంపద కోసం 50 ఏళ్లు పోరాటం..రూ.2,650 కోట్ల ఆస్తిని దక్కించుకున్న న‌వాబుల వారసులు

Rampur Royal Property

Rampur Rs 2,650 crore Rroyal property :  వారసత్వంగా వచ్చే సంపదను ఎవ్వరు వదులుకోరు. దాయాదులతో అయినా..న్యాయస్థానంలోనే అయినా పోరాడి సాధించుకుంటారు ఆ ఆస్తులకు సంబంధించిన వారసులు. అలా తమకు వారసత్వంగా రావాల్సిన ఆస్తుల కోసం 50 ఏళ్లపాటు న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు సాధించుకున్నారు రామ్ పూర్ సంస్థానాధీశులు. న‌వాబు ర‌జా అలీ ఖాన్ వారసులు తమకు న్యాయంగా రావాల్సిన ఆస్తుల కోసం 50 ఏళ్లుగా న్యాయస్థానంలో పోరాడారు. ఎట్టకేలకు వారి ఆస్తిపాస్తులు సాధించుకున్నారు న‌వాబు ర‌జా అలీ ఖాన్ వారసులు. ఉత్తర భారతదేశంలోని రాంపూర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలకుడు అయిన సయ్యద్ రజా అలీ ఖాన్ 16 మంది వారసులు తమ ఆస్తిని దక్కించుకున్నారు.

Read more :NASA Parker Solar Probe: సూర్యుడిని తాకిన NASA ఉపగ్రహం..అక్కడి విశేషాలు తెలుసుకుని షాకైన శాస్త్రవేత్తలు 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రామ్‌పూర్‌ను ఒప్పుడు ఉమ్మ‌డి న‌వాబు ర‌జా అలీ ఖాన్ పాలించారు. అలీఖాన్ ఆస్తులు భారతీయ రాజకుటుంబానికి చెందిన 16మంది వారసులకు దక్కలేదు. దీంతో వారు న్యాయస్థానంలో పోరాడారు. ఎట్టకేలకు పోరాటంలో విజయం సాధించారు.న్యాయస్థానం సుమారు రూ.2650 కోట్ల విలువైన ఆస్తులు అలీఖాన్‌ వారసులకే చెందుతుందని తీర్పునిచ్చింది. దీంతో ఆ ఆస్తి మొత్తం ష‌రియ‌త్ రూల్స్ ప్ర‌కారం.. త‌న 16 మంది చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సులకు త్వ‌ర‌లో పంచి ఇవ్వ‌నున్నారు. ఈ ఆస్తి కోసం వార‌సులు 50 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిర‌గాల్సివ‌చ్చింది. ఈ క్రమంలో వారి పోరాటం ఫలించింది. ఆస్తి దక్కింది.రాంపూర్‌లోని జిల్లా కోర్టు గతవారం తుది తీర్పు వెలువరించటంతో 49 ఏళ్ల కుటుంబ కథ ముగిసింది. దీంతో వారసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఈ ఆస్తుల్లో భాగంగా..ఎస్టేట్‌లో 220 గదుల ఖాస్‌బాగ్ ప్యాలెస్,చుట్టుపక్కల 140 హెక్టార్ల భూమి,ఆ భూమిలో ఉన్న పలు రాజభవనాలు, రత్నాలు పొదిగిన తుపాకులు, లెక్కలేనన్ని ఆభరణాలు, పాతకాలపు కార్ల సముదాయం, విస్తారమైన తోటలతో పాటు ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ కూడా ఉంది.

Read more : Omicron In Bengal : బెంగాల్ లో తొలి ఒమిక్రాన్ కేసు..ఏడేళ్ల బాలుడికి పాజిటివ్

తీర్పు వచ్చిన సందర్భంగా నవాబ్ అలీఖాన్ మనవడు కాజిమ్ అలీ ఖాన్ మాట్లాడుతు..‘‘మాకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు దక్కినందుకు తనతో పాటు మా ఇతర హక్కుదారులు ఆనందంతో ఉన్నాం. నాజీవితమంతా నేను మా హక్కుల కోసం పోరాడానని..ఈ ఆస్తుల పోరాటం ప్రారంభించినప్పుడు నాకు ఏడేళ్లు. అప్పట్లో మా తండ్రి పోరాడారు.తరువాత నేను ఆ పోరాటాన్ని కొనసాగించి ఇన్నాళ్లకు సాధించుకున్నామని తెలిపారు. ఈ పోరాట క్రమంలో ఎంతో ఒత్తిడికి గురయ్యామని తెలిపారు.

పార్టిష‌న్ స్కీమ్ ప్ర‌కారం.. రామ్‌పూర్ జిల్లా జ‌డ్జ్ ఈ తీర్పును వెలువ‌రించారు. జులై 31, 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ తీర్పును రామ్‌పూర్ కోర్టు వెల్ల‌డించింది. 16 మంది వార‌సుల‌లో ఒక వార‌సుడు క‌జిమ్ అలీ ఖాన్ త‌రుపున వాదించిన న్యాయ‌వాది ముకేశ్ స‌క్సేనా తుది తీర్పు కోసం ఫైల్‌ను సుప్రీంకోర్టుకు పంపించామ‌ని తెలిపారు.అప్ప‌ట్లో రామ్‌పూర్‌ను పాలించిన న‌వాబ్ ర‌జా అలీ ఖాన్‌.. 1947 లో భార‌త్‌కు స్వాతంత్య్రం వ‌చ్చాక ఇండియాలో రామ్‌పూర్‌ను విలీనం చేయ‌డానికి అంగీకరించలేదు. ఆ తరువాత 1949లో రామ్‌పూర్‌ను భారత్ లో విలీనం చేశాడు. ఆయ‌న 1966లో మ‌ర‌ణించాడు. ఆయ‌న‌కు ముగ్గురు భార్య‌లు, ముగ్గురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు.

Read more : Heartbreaking Pics : తిండి,నీళ్లు లేక చనిపోయిన జిరాఫీలు..చావు అంచుల్లో 4,000 మూగజీవాలు

రామ్‌పూర్‌ను భార‌త్‌లో విలీనం చేశాక‌.. ఆయ‌న ఆస్తుల‌కు ముగ్గురు కొడుకుల్లో పెద్ద‌వాడైన ముర్తాజా అలీఖాన్ మాత్ర‌మే అస‌లైన వారసుడ‌ని ఆనాటి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో న‌వాబు మిగిలిన కొడుకులు ఇద్ద‌రూ 1972 లో కోర్టులో దావా వేశారు. అప్ప‌టి నుంచి ఆ కేసు కోర్టులో కొనసాగుతు వచ్చింది.న‌వాబు అలీఖాన్ వారసుల్లో పెద్ద‌కొడుకు ముర్తాజా కూతురు నిఖ‌త్ బి, కొడుకు మురాద్ మియాన్‌, న‌వాబు మ‌రో కొడుకు జుల్‌ఫిక‌ర్ అలీ ఖాన్ బ‌హ‌దూర్ భార్య బేగం నూర్ బానో(మాజీ ఎంపీ), ఆమె కొడుకు నవెద్ మియాన్, ఇత‌రులు ఉన్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ప్రాప‌ర్టీలో 200 ఎక‌రాల బెన‌జిర్ బాగ్ ప్యాలెస్‌, స‌ర్హారీ కుందా ప్యాలెస్‌, షాహ్‌బాద్ బాగ్ ప్యాలెస్‌, ప్రైవేట్ రైల్వే స్టేష‌న్‌ను 16 మంది వార‌సుల‌కు స‌మానంగా పంచ‌నున్నారు. 16 మందిలో ఇద్ద‌రు వార‌సులు మ‌ర‌ణించారు. చ‌నిపోయిన వారి వార‌సుల‌కు ఆ షేర్‌ను అందిస్తామ‌ని వాళ్ల త‌రుపు లాయ‌ర్ తెలిపారు.