NASA Parker Solar Probe: సూర్యుడిని తాకిన NASA ఉపగ్రహం..అక్కడి విశేషాలు తెలుసుకుని షాకైన శాస్త్రవేత్తలు

చరిత్రలో తొలిసారి ఓ అద్భుతం జరిగింది. నాసా ప్రయోగించిన ఉపగ్రహం పార్కర్ సోలార్ ప్రూబ్ సూర్యుడ్ని తాకింది. అక్కడి విశేషాలు తెలుసుకుని శాస్త్రవేత్తలు షాక్ అవుతున్నారు.

NASA Parker Solar Probe: సూర్యుడిని తాకిన NASA ఉపగ్రహం..అక్కడి విశేషాలు తెలుసుకుని షాకైన శాస్త్రవేత్తలు

Nasa Enters The Solar Atmosphere

NASA Enters the Solar Atmosphere : రోజు రోజుకు టెక్నాలజీని అభివద్ధి చేస్తున్న మనిషి ఎన్నో విజయాలు సాధించాడు. అందరాని చందమామను తాకాడు. 1969లో తొలిసారి మనిషి చంద్రుడిపై కాలు మోపాడు. ఎన్నో విశేషాలు తెలుసుకున్నాడు. ఆ తరువాత ఎన్నో పరిశోధనలు, మరెన్నో ప్రయోగాలతో దూసుకుపోతున్నాడు మనిషి.ఈ క్రమంలో ఎన్నో విజయాలు సాధించాడు. కానీ భగభగమండే సూర్యుడి దరిదాపులకు కూడా చేరలేకపోతున్నాడు. కానీ ఆ ముచ్చట కూడా తీరిపోయిందేమో అన్నట్లుగా చరిత్రలో తొలిసారి మనిషి సంధించిన ఓ మిషన్ సూర్యుడ్ని తాకింది. సమస్త జీవరాశుల మనుగడకు కారణమైన సూర్యుడు దరిదాపులకు వెళ్లాలంటే మాటలుకాదు. ఎంతటి శక్తివంతమైన అంతరిక్ష నౌక అయినా క్షణాల్లో బూడిద అయిపోతుంది. మచ్చుకు కూడా కనిపించదు.అటువంటిది చరిత్రలో తొలిసారిగా NASA అంతరిక్ష నౌక సూర్యుడ్ని తాకింది. నాసా పంపిన సోలార్ ప్రూబ్ సూర్యుణ్ని తాకింది. అది తెలిసిన శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. నాసా పంపిన సోలార్ ప్రూబ్ సూర్యుణ్ని ఎలా టచ్ చేసింది? ఎందుకు నాసా శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు? అసలు సూర్యుడి ఉపరితలం దగ్గర శాస్త్రవేత్తలకు ఏం కనిపించింది? అనే విషయాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి.

Read more : చంద్రయాన్-2 ప్రయోగం: విక్రమ్ ల్యాండర్‌పై అమెరికా సంచలన కామెంట్స్

ఎప్పటికప్పుడు అంతరిక్ష వింతల్ని తెలుసుకునేందుకు అత్యంత శక్తివంతమైన టెలిస్కోపులతో ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్ష మూలాల్ని జల్లెడపడుతున్నారు. రహస్యాల్ని ఛేదించటానికి ప్రయత్నిస్తున్నారు. ఐతే… ఇప్పటివరకు మన సౌర కుటుంబం గురించి మనకు తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి. సూర్యుడి లోపల ఎలా ఉంటుందో? అనేవి కేవలం ఊహలకే పరిమితంగా ఉన్నాయి. 1969లో మనిషి తొలిసారి చందమామపై అడుగు పెట్టినా..ఇప్పటి వరకు మనుషులు పంపుతున్న స్పేస్‌క్రాఫ్ట్‌లూ, రోవర్లు ఆయా గ్రహాలపై దిగుతున్నాయి..అక్కడి విశేషాలను తెలియజేస్తున్నాయి. అంతేతప్ప.. మనుషులు మాత్రం మరో ఖగోళంపై అడుగు పెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సరికొత్త శకానికి నాంది పలికింది. తొలిసారిగా సూర్యుణ్ని టచ్ చేసేలా ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ని పంపింది. అది విజయవంతంగా సూర్యుణ్ని తాకినట్లు తాజాగా ప్రకటిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసింది నాసా.

నాసా పంపిన పార్కర్ సోలార్ ప్రూబ్ సూర్యుడిని టచ్ చేయటమేకాకుండా సూర్యుడి వాతావరణం లోపలికి చొచ్చుకెళ్లింది. సూర్యుడి ఉపరితల వాతావరణాన్ని కరోనా (corona) అంటారు. ఆ వాతావరణంలోకి వెళ్లిన సోలార్ ప్రూబ్… అక్కడి అణువులను పరిశీలించింది..! అక్కడ అయస్కాంత క్షేత్రం ఎలా ఉందో తెలుసుకుంది.!! ఇదంతా గత ఏప్రిల్‌లో జరిగినా….. ఇది విజయవంతం అయిందని నాసా మంగళవారం (డిసెంబర్ 14,2021)వెల్లడించింది.

Read more : ‘Best space tacos’:అంతరిక్షంలో పండించిన మిర్చితో ‘టాకోస్’..చాలా రుచిగా ఉందంటున్న శాస్త్రవేత్తలు

సూర్యుడి ఉపరితలం ఎలా ఉందంటే..?!
సానా పంపించిన మిషన్ పార్కర్ సోలార్ సూర్యుడ్ని తాకటం ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో అరుదైన మైలు రాయి అని తెలిపింది నాసా. చందమామపై స్పేస్‌క్రాఫ్ట్‌లు, మనుషులూ దిగడం వల్ల అక్కడి పరిస్థితులు..చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో కొంతవరకూ అర్థమైంది. కానీ మండే అగ్నిగోళం సూర్యుడి ఉపరితలం ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుందా, గురుగ్రహం వలె బురదగా ఉంటుందా, వాయువులతో ఉంటుందా? లేక రాళ్లతో గట్టిగా ఉంటుందా? ఎగుడు దిగుడుగా ఉంటుందా?అనే శేష ప్రశ్నలకు కొంతైనా సమాధానాలు దొరికాయి. మనకు దగ్గర్లో ఉన్న నక్షత్రం (సూర్యుడు గురించి కీలక సమాచారం తెలిసింది.

నాసా శాస్త్రవేత్తలు పార్కర్ సోలార్ ప్రూబ్‌ని 2018లో సూర్యుడి పైకి ప్రయోగించారు. అది మూడేళ్లకు సూర్యుణ్ని తాకింది. ఇంతవరకూ ఏ స్పేస్ క్రాఫ్టూ సూర్యుడికి అంత దగ్గరగా వెళ్లిందేలేదు. అలా సూర్యుడి దగ్గరకు వెళ్లాలని..అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని శాస్త్రవేత్తల శతాబ్దాల నుంచి కలకంటుననారు. ఆ కల ఇన్నాళ్లకు ఫలించింది. అలా సూర్యుడ్ని టచ్ చేసిన పార్కర్ సోలార్ సూర్యుడి ఉపరితలం… భూమి లాగా గట్టిగా లేదని తెలియజేసింది..!!

Read more : Film Shooting : అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్

సూర్యుడి ఆకర్షణ, అయస్కాంత క్షేత్రాల ఆకర్షణ అక్కడి సౌర పదార్థంపై ప్రభావం చూపిస్తున్నాయని..సూర్యుడి లోపలి నుంచి పైకి పొంగుకొస్తున్న అత్యంత తీవ్రమైన వేడి, ఒత్తిడీ… సౌర పదార్థాన్ని పైకి నెడుతూ ఉంటే… ఆ సౌర పదార్థం… పైకి ఎగజిమ్ముతోందని సోలార్ ప్రూబ్ ద్వారా తెలిసిందని శాస్త్రవేత్తలు తేల్చారు. సౌర పదార్థం పైకి ఎక్కడి వరకూ వెళ్లగలుగుతుందో… అక్కడి వరకూ సూర్యుడి వాతావరణం ఉండగా… ఆ తర్వాత సౌర గాలులు వీస్తున్నాయని తెలిసింది.

సూర్యుడి కరోనాకి సంబంధించి సేకరించిన ఫొటోల ఆధారంగా… సూర్యుడి ఉపరితలం నుంచి సౌర పదార్థం ఎగజిమ్మే ప్రాంతం 69,57,000 కిలోమీటర్ల నుంచి 1,39,14,000 కిలోమీటర్ల దాకా ఉండొచ్చనే అంచనా ఉంది. నాసా పంపిన పార్కర్ సోలార్ ప్రూబ్… సూర్యుడి వైపుగా 12,52,260 కిలోమీటర్ల దగ్గరకు వెళ్లినప్పుడు దానికి అయస్కాంత క్షేత్రం, అణువులు తగిలినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.