చంద్రయాన్-2 ప్రయోగం: విక్రమ్ ల్యాండర్‌పై అమెరికా సంచలన కామెంట్స్ 

  • Published By: sreehari ,Published On : October 4, 2019 / 01:18 PM IST
చంద్రయాన్-2 ప్రయోగం: విక్రమ్ ల్యాండర్‌పై అమెరికా సంచలన కామెంట్స్ 

ఇండియన్ స్పెస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రుని ల్యాండ్ అవుతున్న విక్రమ్ ల్యాండర్ ఒక్కసారిగా అదృశ్యం కావడంతో ప్రపంచమంతా షాక్ అయింది. భూకేంద్రంతో సిగ్నల్స్ కట్ అయిన విక్రమ్ కమ్యూనికేషన్ సిస్టమ్ తో కనెక్ట్ అయ్యేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఆఖరికి నాసా కూడా రంగంలోకి దిగినా విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టలేకపోయింది. ప్రపంచ అతిపెద్ద అంతరిక్ష కేంద్రం నాసాకే సాధ్యపడలేదనే విషయంలో అమెరికన్ అధికారి ఒకరు స్పందించారు. చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ అదృశ్యంపై అమెరికా అధికారి, స్టేట్ కమర్షియల్ సెక్రటరీ విల్బర్ రాస్ సంచలన కామెంట్స్ చేశారు. బెంగళూరులో ఇస్రో చీఫ్ కే. శివన్ తో కలిసి సమావేశమైన సందర్భంగా రాస్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.

చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ అదృశ్యం వెనుక కారణం ఏమై ఉంటుందని కనిపెట్టడంలో అమెరికా లేదా దాని అంతరిక్ష సంస్థ నాసా చేయగలిగేది చాలా లేదని అన్నారు. విక్రమ్ కమ్యూనికేషన్స్ సిస్టమ్ అనేది ఇండియాకు అంతర్భాగంగా ఉందని చెప్పారు. దీని విషయంలో అమెరికా పెద్దగా చేయగలదు అని నేను అనుకోను అన్నారు.

సెప్టెంబర్ 7న చంద్రునిపై ల్యాండ్ అయ్యే ఆఖరి క్షణాల్లో విక్రమ్‌ నుంచి సిగ్నల్స్ ఇస్రో కోల్పోయింది. ఆరు చక్రాలు గల ప్రగ్యాణ్ రోవర్ కూడా విక్రమ్ ల్యాండర్ లోనే ఉండిపోయింది. విక్రమ్ తో కనెక్ట్ అయ్యేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చంద్రుని దక్షిణ భాగంలో విక్రమ్ ల్యాండ్ అయ్యే ప్రాంతంలో చీకటి వాతావరణం నెలకొంది.

రాత్రి సమయాల్లో చంద్రునిపై ఉష్ణోగ్రత 200 మైనస్ డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. ఇలాంటి వాతావరణాన్ని విక్రమ్ తట్టుకులేదు. విక్రమ్ ఆచూకీ తెలుసుకునేందుకు అప్పుడే రంగంలోకి దిగింది నాసా. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయిన ప్రాంతాన్ని నాసా (ల్యూనర్ రీకాన్ ఏసియన్స్) LRO ఆర్బిటర్ వెళ్లి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించింది. కానీ, నాసా ఆర్బిటర్ LRO తీసిన ఫొటోల్లో విక్రమ్ అనవాళ్లు కనిపించలేదు. చంద్రునిపై సుదీర్ఘ నీడలు కమ్మేయడంతో విక్రమ్ ఏమైందో నాసా గుర్తించలేకపోయింది.