‘Best space tacos’:అంతరిక్షంలో పండించిన మిర్చితో ‘టాకోస్’..చాలా రుచిగా ఉందంటున్న శాస్త్రవేత్తలు

అంతరిక్షంలో పండించిన మిర్చితో ‘టాకోస్’ తయారు చేశారు. ఈ టాకోస్ ను టేస్ట్ చేసిన శాస్త్రవేత్తలు చాలా టేస్ట్ గా ఉందంటున్నారు.

‘Best space tacos’:అంతరిక్షంలో పండించిన మిర్చితో ‘టాకోస్’..చాలా రుచిగా ఉందంటున్న శాస్త్రవేత్తలు

'best Space Tacos'

‘Best space tacos’: నేల మీద మొక్కలు, ఆకుకూరలు పండించటం గురించి తెలుసు. కానీ అంతరిక్షంలో కూడా కూరగాయాల్ని పండించేంత టెక్నాలజీతో దూసుకుపోతున్నారు నాసా శాస్త్రవేత్తలు. దీంట్లో భాంగా అంతరిక్షంలో పచ్చిమిర్చిని పండించారు శాస్త్రవేత్తలు. ఆ మిర్చితో ఓ సంప్రదాయ వంటకాన్ని కూడా వండి చూపించారు. అదే మెక్సికన్ల సంప్రదాయ వంటకం ‘టాకోస్‌’.

Read more : Film Shooting : అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్

టాకోస్ అంటే మన రొట్టెలాగానే ఉంటుంది. కానీ ఆ రొట్టెలో పలురకాల మిక్సింగ్ స్టప్ చేసి పెడతారు. దాన్నే మెక్సికల్లు టాకోస్ అంటారు. టాకోస్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే..రొట్టె, కూరగాయలతో తయారు చేసే వంటకం. అటువంటి వంటాకన్ని అంతరిక్షంలో పండించిన మిర్చితో తయారు చేశారు. నాసా శాస్త్రవేత్తలు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోని నాసా ప్లాంట్‌ హ్యాబిటేట్‌-04 (పీహెచ్‌-04) ప్రయోగశాలలో పండించిన మిరపకాయలతో మెక్సికన్ల సంప్రదాయ వంటకం టాకోస్‌ను తయారు చేశారు.

Read more : Samantha : అంతరిక్షంలోకి సమంత..అరుదైన ఘనత..!

ఈ టాకోస్ ను టేస్ట్ చేసిన శాస్త్రవేత్తలు స్పేస్‌లో పండించిన మిర్చిలతో చేసిన టాకోస్‌ వెరీ టేస్టీగా ఉందని చెబుతున్నారు. అంతరిక్షంలో పండించి మిర్చితో తయారు చేసిన టాకోస్ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో నాలుగు నెలల పాటు సాగు చేసిన ఈ మిరపకాయలను త్వరలోనే భూమి మీదకు తీసుకువస్తామని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు..