Drugs-Weapons : పంజాబ్ గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాలు కలకలం

పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాలు కలకలం రేపాయి. చైనా, టర్కీలో తయారైన ఫిస్టల్స్, ఇతర పేలుడు పదార్థాలు, పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను సరిహద్దు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

Drugs-Weapons : పంజాబ్ గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాలు కలకలం

Drugs and weapons

Updated On : February 18, 2023 / 12:25 PM IST

Drugs-Weapons : పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాలు కలకలం రేపాయి. చైనా, టర్కీలో తయారైన ఫిస్టల్స్, ఇతర పేలుడు పదార్థాలు, పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను సరిహద్దు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గురుదాస్ పూర్ సెక్టార్ లో అనుమానాస్పద కదలికలతో ప్రత్యేక తనిఖీలు చేపట్టగా స్మగ్లర్ల వ్యవహారం బట్టబయలయ్యాయి.

20 ప్యాకెట్ల హెరాయిన్, ఒక చైనా తయారీ ఫిస్టల్, టర్కీ తయారీ ఫిస్టల్ ఒకటి, 6 మ్యాగజైన్లు, 242 రౌండ్ల బులెట్లు, 12 అడుగుల ప్లాస్టిక్ పైపును బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అనుమానాస్పద కదలికలను పసిగట్టి బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరుపుతూ రావడంతో స్మగ్లర్లు పారిపోయారు. ఇప్పటికీ పొగమంచును ఆసరా చేసుకుని ముష్కరులు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.