Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం-ఆఫ్రికన్ దేశస్ధుడు అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్  పట్టుబడ్డాయి.  దూల్‌పెట్ పురానా పూల్ లో కొకైన్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ ను ధూల్ పెట్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం-ఆఫ్రికన్ దేశస్ధుడు అరెస్ట్

Drugs Seized

Drugs :  హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్  పట్టుబడ్డాయి.  దూల్‌పెట్ పురానా పూల్ లో కొకైన్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ ను ధూల్ పెట్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు ఆఫ్రికన్ దేశస్థుడు మోరీస్ ఉన్నాడు. ఇతని వద్ద నుంచి  56 గ్రాముల కొకైన్ తో పాటు రూ. 1,28,000 నగదు ,  ఒక  ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు.  ఆఫ్రికన్ దేశస్తుడు మోరీస్ ఇండియాకు చెందిన సందీప్ కు పురానాపూల్ దగ్గర కొకైన్ అమ్ముతుండగా పట్టుకున్నామని హైదరాబాద్ ఎక్సయిజ్ సూపరిండెంట్ విజయ్ తెలిపారు.

ఆఫ్రికన్ దేశస్తుడు మోరీస్ ఇచ్చిన సమాచారంతో మరో వ్యక్తిని పట్టుకున్నారు. అతని కారులో 11 గ్రాముల కొకైన్ దొరికింది. ఒక హోండా యాక్టివాలో తనిఖీలు చేయగా అందులో ఏడు గ్రాముల కొకైన్, నగదు లభించిందని అధికారులు తెలిపారు.

సన్ సిటీలో నివాసం ఉంటున్న ఆఫ్రికన్ దేశస్తుడి ఇంట్లో సోదాలు చేశామనీ , అక్కడే 38 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆఫ్రికన్ దేశస్తుడు మోరిస్ వనస్థలిపురం తో పాటు సన్ సిటీ నుండి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు అనీ…బ్రూ  కాఫీ ప్యాకెట్లలో ఎవరికి అనుమానం రాకుండా అందులో ఉంచి కొకైన్ ను విక్రయిస్తున్నాడన్నారు. ఆఫ్రికన్ దేశస్ధుడు స్టూడెంట్ వీసాతో వచ్చి సోషల్ మీడియా యాప్స్ ద్వారా డ్రగ్స్ నెట్ వర్క్ సాగిస్తూ డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నాడన్నారు.

Also Read : COVID Cases In India: దేశంలో తగ్గిన కరోనా కేసులు