Waiter Kidnap: హోటల్ బిల్లు కట్టమని అడిగినందుకు వెయిటర్ కిడ్నాప్

ఒక హోటల్‌కు ఐదుగురు వ్యక్తులు రాత్రి డిన్నర్ చేసేందుకు వెళ్లారు. అక్కడ వాళ్లు భోజనం చేసిన తర్వాత వెయిటర్ బిల్లు కట్టమని అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఐదుగురు వెయిటర్‌పై దాడికి పాల్పడ్డారు.

Waiter Kidnap: హోటల్ బిల్లు కట్టమని అడిగినందుకు వెయిటర్ కిడ్నాప్

Waiter Kidnap

Waiter Kidnap: హోటల్‌లో తిన్న ఫుడ్డుకు బిల్లు కట్టమని అడిగినందుకు ఏకంగా వెయిటర్‌నే కిడ్నాప్ చేశారు ఐదుగురు వ్యక్తులు. ఈ ఘటన సోమవారం రాత్రి మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. స్థానిక కత్రాజ్ టన్నెల్ సమీపంలో ఉన్న ఒక హోటల్‌కు ఐదుగురు వ్యక్తులు రాత్రి డిన్నర్ చేసేందుకు వెళ్లారు. అక్కడ వాళ్లు భోజనం చేసిన తర్వాత వెయిటర్ బిల్లు కట్టమని అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఐదుగురు వెయిటర్‌పై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు… అక్కడ్నుంచి అతడ్ని కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన హోటల్ ఓనర్‌ను కూడా బెదిరించారు.

Eye Drops: కళ్లద్దాలకు చెక్.. ఐ డ్రాప్స్‌తో మెరుగయ్యే కంటి చూపు

తెల్లారేసరికల్లా వెయిటర్‌ను చంపేస్తామని హెచ్చరించి, అతడ్ని తీసుకెళ్లారు. తర్వాత ఓనర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను యోగేష్ పార్ధె, ఓంకార్ బెంద్రె, నితిన్ వాదేకర్, రూపేష్ వాదేకర్, రవీంద్ర కనాడేగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి, నిందితుల్ని అరెస్టు చేశారు. మరోవైపు అదేరాత్రి కొంతదూరం వెళ్లిన తర్వాత వెయిటర్‌ను బనేర్ గావ్ అనే ప్రాంతంలో నిందితులు వదిలేశారు.