Bharatsingh Solanki: భర్తతో అఫైర్.. మహిళను చితకబాదిన కాంగ్రెస్ లీడర్ భార్య

తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందనే కారణంతో ఒక మహిళను చితకబాదింది కాంగ్రెస్ లీడర్ భార్య. ఈ ఘటన తాజాగా గుజరాత్‌లో జరిగింది. గుజరాత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.

Bharatsingh Solanki: భర్తతో అఫైర్.. మహిళను చితకబాదిన కాంగ్రెస్ లీడర్ భార్య

Bharatsingh Solanki

Bharatsingh Solanki: తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందనే కారణంతో ఒక మహిళను చితకబాదింది కాంగ్రెస్ లీడర్ భార్య. ఈ ఘటన తాజాగా గుజరాత్‌లో జరిగింది. గుజరాత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై సోలంకికి, భార్యతో విబేధాలు కూడా ఉన్నాయి. తాజాగా సోలంకి మరో మహిళతో ఒక ఇంట్లో ఉండగా, అతడి భార్య రేష్మ పటేల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. రేష్మ, మరికొందరిని తీసుకుని సోలంకి ఉంటున్న చోటుకు వెళ్లింది. ఆ సమయంలో సోలంకి, మరో మహిళ ఉన్నారు.

Vikram: ‘విక్రమ్’ బ్లాక్‌బస్టర్ అంటున్నతమిళ హీరో

తన భర్తతో మరో మహిళ కనిపించడంతో కోపం తెచ్చుకున్న రేష్మ, ఆ మహిళపై దాడి చేసింది. ‘నా భర్తతో ఉంటావా… నిన్ను వదిలిపెట్టను’ అంటూ రేష్మ ఆ మహిళపై దాడికి పాల్పడింది. ఈ దృశ్యాల్ని అక్కడి వాళ్లు మొబైల్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, కొంతకాలంగా భరత్ సింగ్ సోలంకి, అతడి భార్య రేష్మాకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భర్త, రోజూ వేధిస్తున్నాడని, ఇంటి నుంచి గెంటేశాడని రేష్మ ఆరోపించింది.