Hawala Cash : చొక్కా విప్పితే లక్షల గుట్టు రట్టు-చెన్నైలో హవాలా మనీ స్వాధీనం

చెన్నైలో రెండు వేర్వేరు సంఘటనల్లో పోలీసులు ఆంధ్రాకు చెందిన  రూ.2 కోట్ల 60 లక్షల  హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో గంజాయి, మాదక ద్రవ్యాలు, హవాలా ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. 

Hawala Cash : చొక్కా విప్పితే లక్షల గుట్టు రట్టు-చెన్నైలో హవాలా మనీ స్వాధీనం

Hawala Cash

Hawala Cash : చెన్నైలో రెండు వేర్వేరు సంఘటనల్లో పోలీసులు ఆంధ్రాకు చెందిన  రూ.2 కోట్ల 60 లక్షల  హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో గంజాయి, మాదక ద్రవ్యాలు, హవాలా ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.  ఈక్రమంలో   శుక్రవారం బ్యాక్ ప్యాక్ భుజాన   తగిలించుకుని రైలు దిగి వెళ్తున్న ఒక యువకుడిని పోలీసులు తనిఖీలు చేశారు.

తనిఖీల్లో యువకుడి వద్ద 60 లక్షల రూపాయలను పోలీసులు గుర్తించారు. చొక్కా   లోపల బనీను లాంటిది ధరించి… దానిలో కుట్టించిన జేబుల్లో రూ. 30 లక్షలు, అతను తీసుకు  వెళుతున్న బ్యాగ్ లో మరోక రూ.30 లక్షలు గుర్తించారు.  ఆ యువకుడు ఆంధ్రాలోని రాజమహేంద్రవరం నుంచి చెన్నై సెంట్రల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ యువకుడి వద్ద  విజయవాడ నుంచి చెన్నై‌కి  మాత్రమే టికెట్ తీసుకున్నట్లు గుర్తించారు.

యువకుడు తరలిస్తున్న నగదు కు సరైన పత్రాలు లేనందున ఆ నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అందచేశారు. ఈ నగదు ఎక్కడి నుంచి ఎవరికి అందచేయటానికి వెళుతున్నాడనే కోణంలో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మరోక  వైపు చెన్నై నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం చెన్నై నార్త్ బీచ్ ఇనస్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు మన్నాడిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.  ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ లో రిజిష్టరైన వాహనాన్ని తనిఖీ చేయగా అందులో రెండు కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి.

పోలీసులు నగదు  స్వాధీనం చేసుకుని ఆదాయపన్ను శాఖ  అధికారులకు అందచేసారు. నగదు తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఆర్ జయశంకర్ (46), ఎస్ నారాయణన్ (35)గా గుర్తించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Also Read : Chandrababu House Tension : చంద్రబాబు ఇంటి దగ్గర హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు