Chandrababu House Tension : చంద్రబాబు ఇంటి దగ్గర హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటి సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. వాహనాల రాకపోకలను నిలిపేశారు. బారికేడ్లు, ముళ్లకంచెలు సిద్ధం చేశారు. (Chandrababu House Tension)

Chandrababu House
Chandrababu House Tension : ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటి పక్కనున్న ప్రజా వేదికను కూల్చి ఇవాళ్టికి (జూన్ 25) మూడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా శిథిలాల దగ్గర నిరసన తెలిపేందుకు టీడీపీ నేతలు రెడీ అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు, తెలుగు యువత నాయకులు ప్రజా వేదిక వద్దకు రానున్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
టీడీపీ నేతల నిరసన ప్రణాళిక గురించి తెలిసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. చంద్రబాబు ఇంటి సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. కరకట్ట మీదకు వాహనాల రాకపోకలను నిలిపేశారు. బారికేడ్లు, ముళ్లకంచెలు సిద్ధం చేశారు పోలీసులు. కాగా, సీఎం జగన్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు.
Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ప్రజా వేదిక కూల్చివేతకు నేటితో మూడేళ్లు..
టీడీపీ హయాంలో కృష్ణా కరకట్టపై నాటి సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజా వేదికను వైసీపీ ప్రభుత్వం కూల్చివేసి నేటితో సరిగ్గా మూడేళ్లు. ఈ నేపథ్యంలో ప్రజా ధనంతో కట్టిన ప్రజా వేదికను కూల్చివేసిన జగన్ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ప్రజా వేదిక వద్ద నిరసనలకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నాయి.(Chandrababu House Tension)
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రజా వేదిక కూల్చివేత ప్రాంతం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే కరకట్టపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు చంద్రబాబు నివాసం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు దిశగా ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
AP Politics: అప్పుడు తేలిపోద్ది పులి ఎవడో.. పిల్లి ఎవడో!.. విజయసాయికి అయ్యన్న పాత్రుడు కౌంటర్
సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. ప్రజావేదికను అక్రమ కట్టడంగా తేల్చారు. అంతేకాదు అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు అదే రోజు రాత్రి ప్రజావేదికను కూల్చేశారు. అప్పటి నుంచి ఏటా ఇదే రోజు టీడీపీ శ్రేణులు ప్రజావేదిక కూల్చివేసిన ప్రాంతంలోని శిథిలాల వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ ఏడాది కూడా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతుండటంతో పోలీసులు అప్రమత్తమై చంద్రబాబు ఇంటి వద్ద భారీగా మోహరించారు.
ప్రజావేదిక కూల్చివేతతోనే సీఎం జగన్ పాలన మొదలైందని టీడీపీ నేతలు విమర్శించారు. సీఎం జగన్ ఇంటి పునాదులు కదలడంతోనే.. టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని.. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని.. అందుకే టీడీపీ నేతల ఇంటి గోడలు కూల్చివేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. తాడేపల్లి ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారని.. అధికారం ఉందని కొందరు రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.