AP Politics: అప్పుడు తేలిపోద్ది పులి ఎవడో.. పిల్లి ఎవడో!.. విజయసాయికి అయ్యన్న పాత్రుడు కౌంటర్

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ట్విటర్ వేదికగా వీరి మధ్య సవాల్, ప్రతి సవాళ్లు కొనసాగాయి. ఇటీవల అక్రమంగా భూమిని ఆక్రమించి ఇంటిని నిర్మాణాన్ని చేపట్టారంటూ అయ్యన్న పాత్రుడి నివాసాన్ని కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

AP Politics: అప్పుడు తేలిపోద్ది పులి ఎవడో.. పిల్లి ఎవడో!.. విజయసాయికి అయ్యన్న పాత్రుడు కౌంటర్

Vijaya Sai Reddy

AP Politics: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ట్విటర్ వేదికగా వీరి మధ్య సవాల్, ప్రతి సవాళ్లు కొనసాగాయి. ఇటీవల అక్రమంగా భూమిని ఆక్రమించి ఇంటిని నిర్మాణాన్ని చేపట్టారంటూ అయ్యన్న పాత్రుడి నివాసాన్ని కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అధికారులు, సిబ్బంది భారీ పోలీస్ బందోబస్తు నడుమ అయ్యన్న పాత్రుడి ఇంటి వద్దకు వెళ్లి గోడను కూల్చారు. కూల్చివేతను నిలిపివేయాలని అయ్యన్న పాత్రుడు కోర్టును ఆశ్రయించడంతో ఏపీ హైకోర్టు కూల్చివేతను నిలిపివేస్తూ అధికారులను ఆదేశించిన విషయం విధితమే. తాజాగా విజయసాయి రెడ్డి అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పిల్లి తనను ఎవరు వేటాడతారా అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. కానీ పులి కన్నా గొప్పదాన్నని తనకు తానే అనుకుంటుంది. నేను నర్సీపట్నం వస్తా. డేట్, టైం చెప్పు తాగుబోతు. అయినా నువ్వు అఙ్ఞాతంలోకి పోయావటకదా! పారిపోకుండా నిలబడు గంజాయి అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కొద్ది గంటల్లోనే ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డికి అయ్యన్న పాత్రుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. 16నెలలు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడింది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయ సాయి రెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదంటూ విమర్శించారు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ అంటూ అయ్యన్న పాత్రుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపోద్ది ఎవడు పులో ఎవడు పిల్లో! అంటూ ట్విటర్ వేదికగా అయ్యన్న పాత్రుడు విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.