Hyderabad Police : చదువు పేరుతో ఇండియాకొచ్చి వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

వారు విదేశీయులు. చదువు పేరుతో ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ లో మకాం వేశారు. కట్ చేస్తే.. దందా షురూ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

Hyderabad Police : చదువు పేరుతో ఇండియాకొచ్చి వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

Hyderabad Police

Hyderabad Police : వారు విదేశీయులు. చదువు పేరుతో ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ లో మకాం వేశారు. కట్ చేస్తే.. దందా షురూ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే వారు రైడ్ చేశారు. మూడో కంటికి తెలియకుండా నడుస్తున్న వ్యభిచారం గుట్టు రట్టు చేశారు.

గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు విదేశీయులను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం(జూన్ 28,2021) నేరెడ్‌మెట్‌లో డెకాయి ఆపరేషన్‌ నిర్వహించి టాంజానియాకు చెందిన డయానా(24), కాబాంగిలా వారెన్‌(24)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యానా, వారెన్‌ స్టడీ వీసాపై గతేడాది(2020) జనవరిలో హైదరాబాద్‌కు వచ్చారు. తార్నాకలో ఉంటున్నారు.

రెండు నెలల క్రితమే తార్నాక నుంచి నేరెడ్‌మెట్‌కు మకాం మార్చారు. భార్యాభర్తలమని చెప్పి అక్కడ గది అద్దెకు తీసుకున్నారు. మీట్‌24 యాప్‌లో డయానా రిజిస్టర్‌ చేసుకుంది. వినియోగదారులను ఇంటికి రావాలని ఆహ్వానించేది. పక్కా సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ, నేరెడ్‌మెట్‌ పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పాస్‌పోర్టులు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, దాడులు చేస్తున్నా వ్యభిచార ముఠాల ఆగడాలు ఆగడం లేదు. హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచార ముఠాలు గుట్టు చప్పుడు కాకుండా దందా చేస్తున్నాయి.

స్టడీ వీసా పేరుతో ఇండియాకు వచ్చిన విదేశీయులు వ్యభిచారం చేస్తూ దొరికిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఇంకా ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, కొత్త వారికి అద్దెకి ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఇంటి యజమానులకు పోలీసులు సూచించారు. వారు పేర్లు, చిరునామాలు, ఏం పని మీద వచ్చారు? అనే వివరాలు తెలుసుకోవడం మంచిదని అంటున్నారు.