Kerala: పెంపుడు కుక్కకు తిండి పెట్టడంలేదని బంధువు హత్య.. నిందితుడు అరెస్టు

తన పెంపుడు కుక్కకు తిండి పెట్టడం లేదని బంధువునే హత్య చేశాడో వ్యక్తి. కుక్కకు తిండి పెట్టని కారణంగా తనతోపాటు కలిసి ఉంటున్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Kerala: పెంపుడు కుక్కకు తిండి పెట్టడంలేదని బంధువు హత్య.. నిందితుడు అరెస్టు

Kerala: తన పెంపుడు కుక్కకు తిండి పెట్టడం లేదని సమీప బంధువునే హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన కేరళలో, గత శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలక్కాడ్ జిల్లాకు చెందిన హర్షాద్ (21), హకీమ్ (27) సమీప బంధువులు.

Kerala Muslim Women: ఇరాన్ మహిళలకు సంఘీభావం.. హిజాబ్ దహనం చేసిన కేరళ మహిళలు

వాళ్లిద్దరూ కేబుల్ వర్క్ చేస్తూ పెరుంతోడి గ్రామంలో ఒక ఇంట్లో, పై అంతస్థులో అద్దెకు ఉండేవాళ్లు. కొద్ది రోజులుగా హకీమ్ ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే, హర్షాద్ ఆ కుక్కను గురించి పెద్దగా పట్టించుకునే వాడు కాదు. రోజూ తన కుక్క విషయంలో హర్షాద్ నిర్లక్ష్యం చేయడం హకీమ్‌కు కోపం తెప్పించింది. గత శుక్రవారం తన కుక్కకు తిండి పెట్టలేదనే కారణంతో, హర్షాద్‌పై దాడికి పాల్పడ్డాడు. కుక్క బెల్టు, కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో హర్షాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, నేరం తన మీదకు రాకుండా ఉండేందుకు ఇంటి పై కప్పు మీద నుంచి కింద పడిపోయాడని అందరినీ నమ్మించాడు. స్థానికుల సహకారంతో దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడ చికిత్స చేస్తున్న వైద్యులకు అనుమానం వచ్చింది. హర్షాద్‌కు తగిలిన గాయాలు ఇంటి కప్పు పై నుంచి పడితే అయినట్లుగా లేవు. అతడిని ఎవరో బలంగా కొట్టినట్లు ఉన్నాయి.

Lunar Eclipse: రేపే చంద్ర గ్రహణం.. ఏయే నగరాల్లో చూడొచ్చు.. హైదరాబాద్‌లో ఉంటుందా?

అతడి ఒంటిపై అనేక చోట్ల గాయాలయ్యాయి. పక్కటెముకలు కూడా విరిగిపోయాయి. దీంతో వైద్యులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు హకీమ్‌ను విచారించగా మొదట తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరకు అసలు విషయం అంగీకరించాడు. తన కుక్కకు తిండి పెట్టకపోవడం వల్ల హర్షాద్‌పై తానే దాడికి పాల్పడ్డట్లు అంగీకరించాడు. అయితే, హర్షాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్ర గాయాలు కావడం, అంతర్గత అవయవాల్లో రక్తస్రావం వల్ల హర్షాద్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో హకీమ్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.