Actor Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కు ఈడీ నోటీసులు | Actor Mohanlal

Actor Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కు ఈడీ నోటీసులు

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మనీలాండరిగ్ కు  పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.

Actor Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కు ఈడీ నోటీసులు

Actor Mohanlal :  మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మనీలాండరిగ్ కు  పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.  ఈ విషయమై విచారించేందుకు వచ్చేవారం కొచ్చిలోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా ఈడీ కార్యాలయం మోహన్ లాల్ కు నోటీసులు ఇచ్చింది.

పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మన్కల్ తో కలిసి మోహన్ లాల్ మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే పురాతన కళాఖండాలను అమ్ముతూ ప్రజలను 10 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో మాన్సన్‌ను గత సెప్టెంబర్‌లో కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో ఉన్న  మాన్సన్ ఇంటికి ఒకసారి మోహన్ లాల్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మోహన్ లాల్ అతని ఇంటికి ఎందుకు  వెళ్లారనేది తెలియలేదు.

Mohan Lal With Monson Mavunkal

Mohan Lal With Monson Mavunkal

కేరళకు చెందిన మాన్సన్ మన్కల్ గత కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ.10కోట్ల వరకు ప్రజలను మోసం చేశాడు. తనవద్ద టిప్పుసుల్తాన్ సింహాసనం.. ఔరంగజేబు ఉంగరం.. ఛత్రపతి శివాజీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలి గోళ్లు, వంటి వస్తువులు ఉన్నాయని చెప్పి ప్రజలను మోసం చేశాడు.

Monson Mavunkal

Monson Mavunkal

మాన్సన్ పలువురు ప్రముఖులను తన ఇంటికి పిలిపించి తాను సేకరించానని చెప్పుకునే కళాఖండాలను వారికి చూపించేవాడు. ప్రస్తుతం మాన్సన్ జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

Monson Mavunkal

Monson Mavunkal

×