Man ChopsOff Wifes Hand : బాబోయ్.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని భార్య చేయి నరికేసిన భర్త

ప్రభుత్వ ఉద్యోగం ఆమె పాలిట శాపంగా మారింది. ఓ చేయిని కోల్పోయేలా చేసింది. భార్యకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని ఆమె చేయి నరికేశాడు భర్త.

Man ChopsOff Wifes Hand : బాబోయ్.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని భార్య చేయి నరికేసిన భర్త

Man Chopsoff Wifes Hand

Man ChopsOff Wifes Hand : ఈ రోజుల్లో ఉద్యోగం రావడం అంటే అంత ఈజీ కాదు. ప్రైవేట్ సెక్టార్ లో జాబ్ దొరకడమే గగనంగా మారింది. అలాంటిది ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. జాక్ పాట్ కొట్టినంత ఆనందంగా ఫీల్ అవుతారు. ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనే బలమైన భావన చాలామందిలో ఉంది. సర్కారీ కొలువు సంపాదిస్తే వాడికి ఎక్కడో సుడి ఉందంటారు. నెల నెల కచ్చితంగా జీతం వస్తుంది, పైగా జాబ్ నుంచి తీసేస్తారేమో అనే టెన్షన్ లేదు. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకే సర్కారీ కొలువుకి అంత డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది పోటీ పడుతుంటారు. వచ్చినోళ్లు తమను తాము అదృష్టవంతులుగా ఫీల్ అవుతారు.

అయితే, అక్కడ మాత్రం దారుణం జరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం ఆమె పాలిట శాపంగా మారింది. ఓ చేయిని కోల్పోయేలా చేసింది. భార్యకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని.. ఓ భర్త భయంతో దారుణానికి ఒడిగట్టాడు. భార్య చేయి నరికేశాడు. షాక్ కు గురి చేసే ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లో జరిగింది.(Man ChopsOff Wifes Hand)

అనుమానంతో భార్య కాళ్లు, చేతులు నరికేసిన భర్త

ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లాలోని కేతుగ్రామ్ గ్రామానికి చెందిన షేర్ మహహ్మద్, రేణు ఖాతున్ భార్యభర్తలు. రేణు ఖాతున్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా చేస్తోంది. ఇటీవలే పరీక్షల్లో పాసైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం సాధించింది. అయితే, భర్త షేర్ మహమ్మద్ కు ఇది ఇష్టం లేదు. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడం వల్ల ఆమె తనను విడిచిపెట్టి వెళ్లిపోతుందనే భయం అతడిని పట్టుకుంది. దాంతో అతడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించలేదు. జాబ్ లో చేరొద్దని పట్టుబట్టాడు. అయితే, భార్య మాత్రం భర్త మాట వినలేదు. జాబ్ లో జాయిన్ కావాలని డిసైడ్ అయింది.

అయితే, ఎలాగైనా భార్య ఆ జాబ్ లో చేరకుండా చేయాలని నిర్ణయించుకున్న అతడు దారుణానికి ఒడిగట్టాడు. ఉన్మాదిలా వ్యవహరించాడు. ఓ పదునైన ఆయుధంతో భార్య చేయి నరికేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అంతేకాదు.. తెగిన చేయి భాగాన్ని అతడు దాచేశాడు. డాక్టర్లు తిరిగి అతికించకుండా ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. భార్య చేయి నరికిన భర్త.. రక్తమోడుతున్న భార్యను తనే స్వయంగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు ఆమె చేయిని కొంతభాగం తొలగించి వైద్యం చేశారు. ఆ తర్వాత భర్త షేర్ మహమ్మద్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు.

Husband Kills Wife : హైదరాబాద్‌లో దారుణం.. భార్యను చంపి ముక్కలు చేసి డ్రమ్‌లో దాచిన భర్త

ప్రభుత్వ ఉద్యోగం వల్ల తన భార్య తనను విడిచిపెట్టి పోతుందనే భయంతో ఆ భర్త చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. వీడెవడండి బాబూ.. అని ఒకరు, ఈ రోజుల్లోనూ ఇలాంటోళ్లు ఉంటారా? అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. అతడి భయంలో అర్థం లేదని, ఇది చాలా దారుణం అని ఇంకొకరు వాపోయారు. లేని పోని భయాలతో భార్య జీవితాన్ని చేతులారా నాశనం చేశాడని భర్త తీరుపై మండిపడుతున్నారు. వాడు మనిషి కాదు శాడిస్ట్ అని తిట్టిపోస్తున్నారు. ఇలాంటోళ్లను కఠినంగా శిక్షించాలంటున్నారు.

Husband murder Wife: భార్యను హత మార్చిన ‘సాఫ్ట్‌వేర్’ భర్త: తిరుపతిలో దారుణ ఘటన

రేణు ఖాతున్ నర్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అసిస్టెంట్ గా పని చేస్తోందని స్థానికులు తెలిపారు. ఇటీవలే ఆమె ప్రభుత్వం ఉద్యోగం సాధించిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చిందని, జాబ్ లో జాయిన్ కావాలంటూ అపాయింట్ మెంట్ లెటర్ కూడా అందుకుందన్నారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని స్థానికులు వాపోయారు. రేణు ఖాతున్ భర్త షేర్ మహమ్మద్ నిరుద్యోగి. ఏ పని చేయడం లేదు. అయితే, ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే తన భార్య తనను వదిలి వెళ్లిపోతుందనే భయం అతడిని పట్టుకుంది. దీంతో ఉద్యోగంలో చేరొద్దని భార్యతో చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇదే విషయమై కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన భర్త తన పంతం నెగ్గించుకునేందుకు భార్య చెయ్యి నరికేశాడు. కాగా, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది రేణు ఖాతున్ కల అని ఆమె సోదరుడు చెప్పాడు. భార్య, భర్తల మధ్య గొడవ జరుగుతున్న విషయం తమకు తెలుసన్నాడు. అయితే, భర్త షేర్ మహమ్మద్ ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అస్సలు ఊహించలేదని అతడి కన్నీటిపర్యంతం అయ్యాడు.