Odisha Train Accident: రైలు ప్రమాదంపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం

Odisha Train Accident: రైలు ప్రమాదంపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం

Odisha Train Accident

Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం అయింది. 10 మంది సభ్యుల సీబీఐ బృందం సోమవారం బాలాసోర్ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి ట్రిపుల్ రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిందని రైల్వే అధికారి తెలిపారు.ఈ ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిన నేపథ్యంలో సీబీఐ బృందం రంగంలోకి దిగింది. మరో వైపు రైల్వే సేఫ్టీ కమిషనర్ శైలేష్ కుమార్ పాఠక్ బహనాగ బజార్ రైల్వే స్టేషన్‌లోని కంట్రోల్ రూమ్, సిగ్నల్ రూమ్, సిగ్నల్ పాయింట్ లను పరిశీలించారు. అనంతరం రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

Odisha train accident:48 గంటల తర్వాత శిథిలాల్లో వెలుగుచూసిన అసోం యువకుడు

ఈ రైలు ప్రమాదంపై భారతీయ శిక్షాస్మృతి, రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బాలాసోర్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్ (సిఆర్‌ఎస్) విచారణ ప్రారంభించారు.వేగంగా వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌లో ప్రయాణించకుండా లూప్ లైన్‌లోకి వచ్చి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లోని సమస్యలు రైలు మార్గాన్ని మార్చి ఢీకొనడానికి దారితీశాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో ఉద్దేశపూర్వక జోక్యం ఉంటే తప్ప, ప్రధాన లైన్ కోసం సెట్ చేసిన మార్గాన్ని లూప్ లైన్‌కు మార్చడం అసాధ్యమని రైల్వే అధికారులంటున్నారు.

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

డబుల్ లాకింగ్ ఏర్పాట్లు సహా స్టేషన్ రిలే గదులు,కాంపౌండ్స్ హౌసింగ్ సిగ్నలింగ్ పరికరాల భద్రతపై అన్ని జోనల్ హెడ్‌క్వార్టర్‌లకు సూచనలతో కూడిన భద్రతా డ్రైవ్‌ను రైల్వే ప్రారంభించింది. ప్రాథమిక విచారణలో సిగ్నలింగ్ ఫెయిల్యూర్ అనుమానాస్పద కారణం అని తేలింది.ఈ రైలుప్రమాదంపై జూన్ 3వతేదీన ఒడిశా పోలీసులు నమోదు చేసిన బాలాసోర్ జీఆర్‌పీ కేసు నంబర్ 64ని సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఐపీసీ సెక్షన్లు 37, 38, 304ఏ, 34, 153 వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.దీంతోపాటు రైల్వే చట్టంలోని 154, 175 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది.