Massage Centers : స్పా సెంటర్..యువకులకు గాలం..పచ్చి వ్యభిచారం పోలీసులు దాడులు

10TV కథనాలతో రంగంలోకి దిగిన పోలీసులు మసాజ్ సెంటర్లో దాడులు నిర్వహించారు. సెక్స్ దందాపై ఆరా తీశారు. స్పా సెంటర్ మొత్తం తనిఖీ చేశారు. కొత్తగూడ ఇష్ స్పా సెంటర్‌లో ఉండే సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Massage Centers : స్పా సెంటర్..యువకులకు గాలం..పచ్చి వ్యభిచారం పోలీసులు దాడులు

Massage Centers

Spa Centers In Hyderabad : స్పా సెంటర్ ముసుగులో హైటెక్ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్న విషయాన్ని టెన్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేసింది. నార్త్ నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నారనే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. స్పెషల్ సర్వీసుల పేరిట యువకులకు వల వేస్తూ… ఎలా దందా నిర్వహిస్తున్నారనే విషయాన్ని కళ్లకు కట్టింది. ఒక్కో సర్వీసుకు ఒక్కో రేటు ఫిక్స్ చేసిన నిర్వాహకులు.. యువకులకు గాలం వేస్తూ పచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలు బేఖాతర్ చేస్తూ విటులను ఆకర్షిస్తున్నారు. 10TV కథనాలతో రంగంలోకి దిగిన పోలీసులు మసాజ్ సెంటర్లో దాడులు నిర్వహించారు. సెక్స్ దందాపై ఆరా తీశారు. స్పా సెంటర్ మొత్తం తనిఖీ చేశారు. కొత్తగూడ ఇష్ స్పా సెంటర్‌లో ఉండే సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కొత్తగూడలోని ఇష్ స్పా సెంటర్‌లో తనిఖీలు చేసిన పోలీసులు.. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కతు తరలించి విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోందని విషయాన్ని టెన్ టీవీ ప్రసారం చేసింది. దీంతో… పోలీసులు ఆ దందా పై దృష్టిపెట్టారు. కొత్తగూడ, గచ్చిబౌలి, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మలక్‌పేట్ సెంటర్లపై ఆరా తీస్తున్నారు. మసాజ్ సెంటర్ల వెనక ఎవరున్నారనే విషయంపై పోలీసుల దృష్టి పెట్టారు.

అసలే కరోనా కాలం. భౌతిక దూరం పాటించకుంటే మహమ్మారి కాటేస్తుంది. అయినా కూడా డోంట్ కేర్ అంటున్నాయి స్పా సెంటర్లు. సిగ్గూ ఎగ్గూ లేకుండా జనం వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం దందాను పక్కాగా నిర్వహిస్తున్నాయి. మరి ఇంత జరుగుతున్నా పోలీసులేం చేయరా.. అంటే.. అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడరట. ఎందుకంటే ఎవరికి ముట్టాల్సినవి వారికి ముట్టిపోతాయి. అంతే కాదు.. ఈ స్పా యవ్వారం వెనక బడాబాబులు, పొలిటీషియన్ల సపోర్ట్ కూడా ఉందని టెన్ టీవీ పరిశోధనలో తేలింది.

మన దేశంలో వ్యభిచారం చట్ట వ్యతిరేకం. అయినా చాలా మంది దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను ఇందులోకి దింపుతున్నారు. ఆ తర్వాత దందా కొనసాగిస్తూ… అమ్మాయిలను ఆటబొమ్మల్లా చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో స్పా ముసుగులో క్రాస్ మసాజ్, వ్యభిచారం జరుగుతూనే ఉంది. కస్టమర్లకు మంచి సేవలు ఇచ్చేందుకుగాను మంచి జీతాలు ఇచ్చి స్పా యాజమాన్యాలు అమ్మాయిలను రిక్రూట్ చేసుకుంటున్నాయి. అయితే మసాజ్ పనులు తప్ప మిగతాపనుల్లన్నీ వారితో చేయిస్తున్నారు. పైగా సెక్స్ మసాజ్ ఎలా చేస్తారో.. ఎలాంటి ప్యాకేజ్‌లు ఉన్నాయో.. కస్టమర్లకు పచ్చిగా చెప్పడానికి ఈ అమ్మాయిలనే ఉపయోగిస్తారు.

ఇప్పుడు కరోనా సీజన్ నడుస్తోంది. వైరస్ దెబ్బకు ప్రపంచాలే వర్రీ అవుతున్నాయి. బిజినెస్‌లకు బిజినెస్‌లు మూతబడుతున్నాయి. కానీ… స్పా సెంటర్ నిర్వాహకులు, స్టాఫ్‌లో ఎలాంటి భయం కనిపించదు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుంటే ప్రమాదం అనే టెన్షన్ కనిపించదు. రోగమొస్తే ఏంటి.. రొష్టు వస్తే మాకేంటి అన్నట్లుగానే వ్యవహారం ఉంటుంది. పైగా.. తమ స్పాకి వచ్చే వారికి కహానీలు చెబుతారు. తాము ఎంతో హైజీన్ మెయిన్‌టేన్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. పైగా.. కరోనా అస్సలు లేనే లేదని.. అంతా రాజకీయం అంటూ కొట్టిపారేస్తారు.

జనరల్‌ మసాజ్‌ కోసం స్పా సెంటర్‌కు వచ్చే కస్టమర్లనూ బుట్టలో వేసుకోవడంలో వీళ్లు ఎక్స్‌పర్ట్‌. ఒక్కసారి కస్టమర్ ఈ స్పా సెంటర్‌కు వస్తే.. చాలు. అందమైన అమ్మాయిలు ఉన్నారని ఎర వేస్తారు. మీకు నచ్చిన అమ్మాయిని సెలక్ట్ చేసుకుని ఎంజాయ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందని ఊరిస్తారు. అంతేకాదు.. రూమ్ సర్వీస్, హోం సర్వీస్ కూడా అందుబాటులో ఉందనే విషయాన్ని చెబుతారు. కాకుంటే… హోం సర్వీస్ కావాలంటే ముందే అమౌంట్ పే చేయాలి. అది కూడా పికప్ డ్రాపింగ్ కస్టమరే చూసుకోవాలి. క్యాబ్ బుక్ చేయాలి, లొకేషన్ షేర్ చేయాలి. ఈ సర్వీస్ కావాలంటే 15 వేలు నుంచి 25 వేల రూపాయల వరకు సమర్పించుకోవాల్సి ఉంటుంది.

స్పా సెంటర్‌లో మసాజ్ ఓకే.. సెక్సువల్ మసాజ్ ఓకే.. మరి పోలీస్‌ రైడింగ్స్‌ జరగవా.. పోలీసులు పట్టించుకోరా… ఇదే విషయంపై టెన్ టీవీ దృష్టి పెట్టింది. అసలు విషయాన్ని ఆరా తీసింది. జనం తిరిగే ప్రాంతంలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం జరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారనే విషయంపై కూపీ తీసింది. అంతే మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్‌లో సమాధానం వచ్చింది. స్పా సెంటర్లలో జరిగే బాగోతమంతా చాలా గుట్టుగా సాగిపోతోంది.

అసలు కస్టమర్ భయపడాల్సిన అవసరమే లేదు. పోలీసులు వస్తారనే టెన్షన్ కూడా ఉండదు. ఇదే భరోసాను కస్టమర్లకు కూడా స్పా నిర్వాహకులు కలిగిస్తారు. ఎందుకంటే… ఈ స్పా సెంటర్‌లో వ్యభిచారం జరుగుతోంది అనే విషయం పోలీసులకు ఓపెన్ సీక్రెట్. ఈ విషయం తెలిసినా వాళ్లు అటు వైపు కూడా కన్నెత్తి చూడరు. అదేంటి దాడులు చేయాలి కదా.. సీజ్ చేయాలి కదా ఆనే అనుమానం వస్తే… దానికీ ఓ రేట్ కట్టేశారు స్పా నిర్వాహాకులు. పోలీసులకు ప్రతీ నెలా మామూళ్లు ముట్టజెప్పేస్తారు. స్టేషన్‌కు ఇంత అని, సెక్టార్ ఎస్ఐకి ఇంత అని అమ్యామ్యాలు పంపించేస్తారు. ఒక్క ఎస్ఐకే 25వేల నుంచి 30 వేల రూపాయలు ముట్టజెబుతారంటే… మిగతా వారికి ఇంకెంత ఇస్తారో.. ఏ రేంజ్‌లో దందా సాగిస్తున్నారో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు.

పోలీసుల నుంచి ఎలాంటి సమస్యా లేదు.. మరి వేరే ఎమైనా సమస్యలు వస్తే ఎలా. స్పా సెంటర్‌ను ఎవరు కాపాడతారు. రాజకీయ నాయకులు. అవును పొలిటీషియన్లు వారి అనుచురల కనుసన్నల్లోనే స్పా సెంటర్లు నడుస్తున్నాయనే విషయం టెన్ టీవీ పరిశోధనలో తేలింది. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండటంతో మూడు మసాజ్‌లు ఆరుగురు విటులు అన్నట్లుగా వ్యాపారం సాగిపోతోంది. మదాపూర్‌లో ఉన్న ఇషా బ్యూ పార్లర్ స్పా ఓ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడైన నవీన్ యాదవ్‌ది. యూసఫ్‌గూడలో ఉండే నవీన్‌కు అత్యంత సమీపంగా ఉండే సందీప్ అనే వ్యక్తి ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి చెందిన నేత కావడంతో… దందా జోరుగా సాగుతోంది. ఏకంగా సిటీ మొత్తంలో దాదాపుగా తొమ్మిది ప్రాంతాల్లో బ్రాంచులు ఓపెన్ చేసే స్థాయికి ఆ వ్యాపారం ఎదిగింది.

జనం రద్దీగా ఉండే చోట స్పా పేరుతో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. చుట్టు పక్కల ఉండే జనం అమాయకులు. ఫ్యామిలీస్ ఉంటాయి. స్పాకు వచ్చేవారు ఏమైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే పరిస్థితి ఏంటి. పోలీసులు, రాజకీయ అండతో వ్యాపారం సాగిపోతోంది. కానీ.. స్పా ముసుగులో వ్యభిచారమే జరుగుతోందా… లేక డ్రగ్స్ దంగా.. ఇంకా ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా.. లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఏదేమైనా కఠిన చట్టాలు చేయడమే కాదు.. వాటిని పక్కాగా అమలు చేస్తే తప్ప.. ఈ వ్యవస్థలో మార్పు రాదన్నది జగమెరిగిన సత్యం.

Read More : Semi nude massage : మసాజ్.. సెమీ న్యూడ్ మసాజ్, ఒక్కో సర్వీసుకు ఒక్కో రేటు