V Muraleedharan’s house: కేంద్ర సహాయ మంత్రి వీ మురళీధరన్ నివాసం వద్ద కలకలం

కేంద్ర సహాయ మంత్రి వీ మురళీధరన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు దాడి చేయడానికి యత్నించి కలకలం రేపారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయన నివాసంలోకి చొరబడి మరీ గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. వీ మురళీధరన్ నివాసం వద్ద కార్లు పార్క్ చేసుకునే చోట దుండగులు అద్దాలను పగులగొట్టారు. అక్కడ రక్తపు చుక్కలను కూడా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.

V Muraleedharan’s house: కేంద్ర సహాయ మంత్రి వీ మురళీధరన్ నివాసం వద్ద కలకలం

V Muraleedharan's house

V Muraleedharan’s house: కేంద్ర సహాయ మంత్రి వీ మురళీధరన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు దాడి చేయడానికి యత్నించి కలకలం రేపారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయన నివాసంలోకి చొరబడి మరీ గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. వీ మురళీధరన్ నివాసం వద్ద కార్లు పార్క్ చేసుకునే చోట దుండగులు అద్దాలను పగులగొట్టారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు మురళీధరన్ కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. ఈ విషయంపై మెడికల్ కాలేజీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ రక్తపు చుక్కలను కూడా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.

దాడికి పాల్పడ్డ దుండగులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడి ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేయించారా? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. జాగిలాలతో వచ్చి పోలీసులు ఘటనాస్థలి వద్ద ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. మురళీధరన్ కేంద్ర విదేశాంగ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.
Tripura Election: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నద్దా