Gurugram Couple: దంపతులు కాదు.. రాక్షసులు! 14 ఏళ్ల బాలికను హింసించిన జంట.. ఇంట్లో పని చేయించుకుంటూ దారుణం

గురుగ్రామ్‌లో ఉంటున్న దంపతుల ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన 14 ఏళ్ల ఒక బాలిక కొంతకాలం నుంచి పని చేస్తోంది. నిబంధనల ప్రకారం.. 14 ఏళ్ల వయసున్న పిల్లలతో పని చేయించుకోవడం నేరం. అలాంటిది ఆ బాలికతో ఇంట్లో పని చేయించుకోవడమే కాకుండా, తనపై తీవ్రమైన హింసకు పాల్పడ్డారు.

Gurugram Couple: దంపతులు కాదు.. రాక్షసులు! 14 ఏళ్ల బాలికను హింసించిన జంట.. ఇంట్లో పని చేయించుకుంటూ దారుణం

Gurugram Couple: ఆధునిక కాలంలోనూ బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. ఇప్పటికీ కొందరు నిబంధనలకు విరుద్ధంగా పిల్లలతో పని చేయించుకుంటున్నారు. అంతేకాదు.. పిల్లలపై అమానవీయంగా హింసకు పాల్పడుతున్నారు. తాజాగా గురుగ్రామ్‌లో 14 ఏళ్ల వయసున్న బాలికతో ఇంట్లో పని చేయించుకుంటూ, తీవ్రమైన హింసకు పాల్పడిందో జంట.

Google Bard: ‘చాట్‌జీపీటీ’కి పోటీగా గూగుల్ ‘బార్డ్’.. బ్లాగ్ ద్వారా వెల్లడించిన సుందర్ పిచాయ్

సోషల్ మీడియా ద్వారా వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. గురుగ్రామ్‌లో ఉంటున్న దంపతుల ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన 14 ఏళ్ల ఒక బాలిక కొంతకాలం నుంచి పని చేస్తోంది. నిబంధనల ప్రకారం.. 14 ఏళ్ల వయసున్న పిల్లలతో పని చేయించుకోవడం నేరం. అలాంటిది ఆ బాలికతో ఇంట్లో పని చేయించుకోవడమే కాకుండా, తనపై తీవ్రమైన హింసకు పాల్పడ్డారు. రోజూ కర్రలతో కొట్టడం, వంట పాత్రలు కాల్చి వాతలు పెట్టడం చేసేవాళ్లు. ఇంట్లో ఏదైనా వస్తువు కనబడకపోతే, ఆ బాలికే దొంగతనం చేసిందనే ఆరోపణలతో తీవ్రంగా హింసించేవాళ్లు. రోజుల తరబడి సరిగ్గా తిండి కూడా పెట్టేవాళ్లు కాదు. దీంతో డస్ట్‌బిన్‌లో పడేసిన ఆహారం తిని కడుపు నింపుకొనేది. ఇలా కొన్ని నెలలుగా తీవ్ర హింసకు గురైంది బాలిక.

Zoom Layoffs: ఉద్యోగాలకు కోత పెడుతున్న జూమ్.. 1300 మందిని తొలగించేందుకు సిద్దం

ఈ హింస విషయం వారి ఇంటి చుట్టుపక్కల వాళ్లు గమనించే వాళ్లు. అయితే, ఎలాగోలా ఈ విషయం ఒక స్వచ్ఛంద సంస్థ దృష్టికి చేరింది. వాళ్లు తీవ్ర గాయాలపాలైన బాలిక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ అంశం వైరల్‌గా మారింది. బాలిక గాయాలు చూసి చాలా మంది తల్లడిల్లారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆ స్వచ్ఛంద సంస్థ తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బాలికను రక్షించారు. హింసకు పాల్పడ్డ దంపతుల్ని అరెస్టు చేశారు.

బాలికను ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఒంటిపై తీవ్రమైన గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పూర్తిగా సమీక్షిస్తున్నారు. బాలికపై అత్యాచారం ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా వైద్యులు పరీక్షిస్తున్నారు.