Woman Dress Changing : ట్రయల్‌రూమ్ లో బట్టలు మార్చుకుంటుండగా వీడియో తీసిన యువకులు

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఒక మహిళ   ట్రయల్ రూం లో బట్లలు మార్చుకుంటుండగా ఇద్దరు  యువకులు వీడియో తీశారు.

Woman Dress Changing :  ట్రయల్‌రూమ్ లో బట్టలు మార్చుకుంటుండగా వీడియో తీసిన యువకులు

Trail Room

Updated On : November 5, 2021 / 5:30 PM IST

Woman Dress Changing : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ లోని ప్రముఖ దుస్తుల షాప్ లో కీచకులు బరి తెగించారు. నిన్న దీపావళి పర్వదినాన సాయంత్రం పూట జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో పేరొందిన ప్రముఖ బట్టల దుకాణం H&Mలో షాపింగ్ కు వెళ్లిన ఒక యువతి ట్రయల్‌రూంలో దుస్తులు మార్చుకుంటుండగా, దానికి అనుకోని ఉన్న మరొక ట్రయల్ రూమ్ లోకి వెళ్లిన ఇద్దరు యువకులు పార్టిషన్ పై నుండి మొబైల్ ఫోన్ ద్వారా, దుస్తులు మార్చుకుంటున్న యువతి ని వీడియో చిత్రీకరించారు.

ఇది గమనించిన యువతి మొదట కేకలు వేయడంతో అక్కడున్నవారు యువకులను పట్టుకున్నారు. అనంతరం డయల్‌ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీడియో తీసిన మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కిరిట్ అసాట్, gourav కళ్యాణ్ అనే ఇద్దరు యువకులతో పాటు స్టోర్‌ మేనేజర్‌ ఆమన్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. యువకుల సెల్ ఫోన్ లో ఇలాంటి దృశ్యాలు మరికొన్ని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.