NBCC JOBS : ఎన్ బీసీసీలో ఉద్యోగాల భర్తీ

ప్రాజెక్ట్​ మేనేజర్​ సివిల్ కేటగిరీలో మొత్తం 15 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జీతం రూ.60వేల నుంచి రూ.1.80 లక్షల వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు సివిల్​ ఇంజినీరింగ్​లో డిగ్రీ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్​ ఇంజినీరింగ్​కు సమానమైన డిగ్రీ చేసి ఉండాలి.

NBCC JOBS : ఎన్ బీసీసీలో ఉద్యోగాల భర్తీ

Nbcc Jobs

NBCC JOBS : కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ సంస్థ నేషనల్​ బిల్డింగ్స్​ కన్​స్ట్రక్షన్​ కార్పొరేషన్​ ఇండియా లిమిటెడ్​(ఎన్​బీసీసీ) మేనేజర్​ పోస్టుల భర్తీ చేపట్టనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనరల్​ మేనేజర్​ ఇంజినీరింగ్​, అడిషనల్​ జనరల్​ మేనేజర్​ మార్కెటింగ్​, ప్రాజెక్ట్​ మేనేజర్​ సివిల్​ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

జనరల్​ మేనేజర్ ​ఇంజినీరింగ్​ కేటగిరీలో మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెలకు జీతం సుమారు రూ.90 వేల నుంచి రూ.2.40 లక్షలు వేతనంగా చెల్లిస్తారు. విద్యార్హతలకు సంబంధించి సివిల్​ ఇంజినీరింగ్​లో పట్టా లేదా దానికి సమానమైన డిగ్రీ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. పీఎంసీ, ఈపీఎస్​, స్తిరాస్థి రంగం, మౌలిక సదుపాయాల రంగాల్లో కనీసం 15 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.

అడిషనల్​ జనరల్​ మేనేజర్​ మార్కెటింగ్​ కేటగిరీలో మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. వేతనంగా నెలకు రూ.80 వేల నుంచి రూ.2.20లక్షలు చెల్లిస్తారు. విద్యార్హతలకు సంబంధించి ఎంబీఏ లేదా ఏదైనా రంగంలో రెండేళ్ల పోస్ట్​ గ్యాడ్యుయేషన్​ డిప్లొమా చేసి ఉండాలి. బిజినెస్​ డెవలప్​మెంట్​ లేదా మార్కెటింగ్​లో 12 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి.

ప్రాజెక్ట్​ మేనేజర్​ సివిల్ కేటగిరీలో మొత్తం 15 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జీతం రూ.60వేల నుంచి రూ.1.80 లక్షల వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు సివిల్​ ఇంజినీరింగ్​లో డిగ్రీ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్​ ఇంజినీరింగ్​కు సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. పీఎంసీ, ఈపీఎస్​, రియల్​ ఎస్టేట్​, ఇన్​ఫ్రాస్టక్చర్​ రంగాల్లో కనీసం ఆరేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు జూన్​ 8, 2022 చివరి గడువు తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.nbccindia.com/ పరిశీలించగలరు.