NHRIMH Recruitment : నేషనల్ హోమియోపతి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ మెంటల్ హెల్త్ లో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎండీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

NHRIMH Recruitment : నేషనల్ హోమియోపతి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ మెంటల్ హెల్త్ లో ఉద్యోగాల భర్తీ

National Homoeopathic Research Institute in Mental Health Vacancy

Updated On : November 5, 2022 / 9:31 PM IST

NHRIMH Recruitment : కేరళలోని కొట్టాయంలో ఉన్న సీసీఆర్‌హెచ్‌ నేషనల్ హోమియోపతి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ మెంటల్ హెల్త్ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎంహెచ్‌)లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీలకు సంబంధించి ప్రొఫెసర్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ (01), ప్రొఫెసర్ (సైకియాట్రీ) (02), అసిస్టెంట్ ప్రొఫెసర్ (సైకియాట్రీ) (01), కన్సల్టెంట్ (సైకియాట్రీ) (01), పాథాలజిస్ట్ (01), క్లినికల్ సైకాలజిస్ట్ (01), ఆక్యుపేషనల్ థెరపిస్ట్ (01), సైకియాట్రిక్ సోషల్ వర్కర్ (01), థెరపీ అసిస్టెంట్ (ఆక్యుపేషనల్) (01) ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎండీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ది ఆఫీసర్‌ ఇన్‌ఛార్జి, ఎన్‌హెచ్‌ఆర్‌ఎంహెచ్‌, సచివోత్తమపురం, కొట్టాయం, కేరళ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరీ తేదీగా 30-11-2022ని నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ccrhindia.nic.in/ పరిశీలించగలరు.