NEET-PG Counselling : నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీం బ్రేక్

నీట్ పీజీ - 2021 కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని సోమవారం(అక్టోబర్-25,2021) కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2021-22 విద్యాసంవత్సరం నుంచి 15 శాతం యూజీ, 50 శాతం పీజీ ఆల్‌

NEET-PG Counselling : నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీం బ్రేక్

Sc

NEET-PG Counselling    నీట్ పీజీ – 2021 కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని సోమవారం(అక్టోబర్-25,2021) కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2021-22 విద్యాసంవత్సరం నుంచి 15 శాతం యూజీ, 50 శాతం పీజీ ఆల్‌ ఇండియా కోటా(AIQ) సీట్లలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు గత నెలలో పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

జస్టీస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC)నిర్షయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫున అడ్వకేట్ దాతర్ వాదనలు వినిపించారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇప్పటికే నీట్ పీజీ కౌన్సిలింగ్ 2021ను ప్రారంభించిందని దాతర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఆల్ ఇండియా కోటా(AIQ)లో కేంద్రం ప్రవేశ పెట్టిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చెల్లుబాటుపై తాము నిర్ణయం తీసుకునే వరకు కౌన్సిలింగ్ నిర్వహించవద్దని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తాము నిర్ణయం తీసుకోవడానికి ముందే కౌన్సిలింగ్ ను నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని కోర్టు అభిప్రాయపడింది. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నీట్-పీజీ కౌన్సిలింగ్​ నిర్వహించబోమని కేంద్ర ప్రభుత్వం తరపున..సుప్రీంకోర్టుకి అడిషనల్ సొలిసిటర్ జనరల్ నటరాజ్ హామీ ఇచ్చారు.

కాగా, జాతీయ జీవన వ్యయసూచిక ఆధారంగా 8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని ఈడబ్ల్యూఎస్​ కేటగిరీని నిర్ణయించినట్లు సుప్రీం అడిగిన ప్రశ్నకు కేంద్రం గతంలో సమాధానమిచ్చింది. రిజర్వేషన్లపై కేంద్రాన్ని ప్రశ్నలు అడిగేందుకు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖతోపాటు డీఓపీటీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ లేదా పీజీ మెడిసిన్ వైద్య విద్యలో అడ్మిషన్‌కు జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(NEET)అంటే నీట్‌లో అర్హత తప్పనిసరి. పీజీ నీట్ లో అర్హత పొందిన విద్యార్ధులు కౌన్సిలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. రాష్ట్ర నీట్ పీజీ కోటా సీట్ల భర్తీకై కౌన్సిలింగ్‌ను సంబంధిత రాష్ట్ర వైద్య కౌన్సిలింగ్ కమిటీలు నిర్వహిస్తాయని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రకటించింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ , సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకు నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. డీమ్డ్ , సెంట్రల్ యూనివర్శిటీ సీట్లు, పీజీ డీఎన్‌బీ సీట్ల ప్రవేశం కోసం అదనపు రౌండ్ ఉంటుంది. మిగిలిన సీట్ల కోసం చివరిలో మరో రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది.

మరోవైపు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల అర్హత కోసం ఏటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) మళ్లీ వాయిదా పడింది. ఇంతకుముందు అక్టోబర్ 17 నుంచి 25 తేదీల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.

కానీ ఇప్పుడు ఆ టెస్ట్‌ను మరోసారి వాయిదా వేస్తున్నామని.. తదుపరి నోటీస్ వచ్చే వరకు వేచి చూడాలని ఎన్‌టీఏ వెల్లడించింది. డిసెంబర్ 2020 నుంచి అభ్యర్థులు నెట్ ఫైనల్ ఎగ్జామ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్‌టీఏ మాత్రం గత పది నెలల్లో ఏకంగా నాలుగుసార్లు పరీక్షలను వాయిదా వేసి అభ్యర్థుల్లో తీవ్ర నిరాశకు దారి తీసింది. 2021 జూన్‌లో నిర్వహించాల్సిన యూజీసీ నెట్ పరీక్షను కూడా డిసెంబర్ 2020 పరీక్షలో కలిపేశారు. ఈ రెండు దశల పరీక్షలను నెలలు గడుస్తున్నా నిర్వహించకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు.

ALSO READ CM KCR : టీఆర్ఎస్ కు అధిష్టానం లేదు.. తెలంగాణ ప్రజలే బాస్ లు : సీఎం కేసీఆర్