PG Admissions : పీజీ ప్రవేశాల అర్హతల సడలింపు.. కెమిస్ట్రీ లేకున్నా ఆరు కోర్సుల్లో అడ్మిషన్

డిగ్రీలో ఏ కోర్సు తీసుకున్న వారైనా ఎంకామ్ లో ప్రవేశాలు పొందవచ్చు. ఎంకామ్ ఎంట్రెన్స్ లో ప్రతిభ సాధించాల్సి ఉంటుంది.

PG Admissions : పీజీ ప్రవేశాల అర్హతల సడలింపు.. కెమిస్ట్రీ లేకున్నా ఆరు కోర్సుల్లో అడ్మిషన్

PG Admission

postgraduate courses : పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ)కోర్సుల్లో ప్రవేశాలకు నిబంధనలను ఏటా సడలిస్తున్న అధికారులు తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాల అర్హతలను సడలించారు. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు. ఆరు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలన్న నిబంధనను సీపీగెట్ అధికారులు ఎత్తి వేశారు.

మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్ మెంట్ సైన్స్, బయో కెమిస్ట్రీ, న్యూట్రిషన్, డైటెటిక్స్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశానికి కెమిస్ట్రీని చదివి ఉండాలన్న నిబంధనను తొలగించారు. ఈ నిర్ణయంతో బీఎస్సీ బీజెడ్ సీ, మైక్రోబయాలజీ, బయాలజీ, జువాలజీ వంటి కాంబినేషన్ తో డిగ్రీ పూర్తిచేసిన వారు పైన పేర్కొన్న ఆరు సబ్జెక్టుల్లో చేరవచ్చు.

Group 4 Results 2023 : గ్రూప్-4 ఫలితాలు విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి..

తాజాగా డిగ్రీలో ఏ కోర్సు తీసుకున్న వారైనా ఎంకామ్ లో ప్రవేశాలు పొందవచ్చు. ఎంకామ్ ఎంట్రెన్స్ లో ప్రతిభ సాధించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో వివిధ యూనివర్సిటీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. కొత్తగా నిజాం కాలేజీలో పీజీ స్థాయిలో ఫెర్మెంట్ షన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టగా, నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ లో ఎంఏ హిస్టరీ, ఎంఏ టూరిజం, ఎంఏ సైకాలజీ కోర్సులను ప్రవేశపెట్టారు.

2023-24లో ప్రవేశాల కోసం సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 300 కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దాదాపు 45వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. సీపీగెట్ కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం అయింది. దాదాపు 50 సబ్జెక్టులకు జూన్ చివరి వారంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.