TS-CET Apply Dates : టీఎస్ సెట్‌ల దరఖాస్తుల గడువు పొడిగింపు 

తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగించారు. గతంలో జూన్‌ 15 వరకు గడువు ఉండగా.. ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు.

TS-CET Apply Dates : టీఎస్ సెట్‌ల దరఖాస్తుల గడువు పొడిగింపు 

Ts All Cets Application Dates Extended

TS CET Application Dates : తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగించారు. గతంలో జూన్‌ 15 వరకు గడువు ఉండగా.. ఈ నెల 23వ తేదీ వరకు ఎలాంటి రుసుము లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్, కె.రాజిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండడం, కొన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలు జరగలేదు. దాంతో ఈ నెల 15వ తేదీతో ముగియనున్న గడువును పెంచామని ఆయన పేర్కొన్నారు.

బీఎడ్ :
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్‌–2021 దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్‌ ఎ.రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

లాసెట్‌ : 
న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీలాసెట్‌ – 2021 దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీబీరెడ్డి తెలిపారు. విద్యార్థులు వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తద్వారా వారు ఎంచుకున్న సమీప ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాన్ని కేటాయించే వీలు ఉంటుందని చెప్పారు.

పీఈసెట్‌   :
డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఈడీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్‌–2021 దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు పీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.