Nagpur MLC Election:ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్ పరిధిలో బీజేపీకి దారుణ ఎదురు దెబ్బ
జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఫలితాలు శుక్రవారం విడులవుతున్నాయి. నాగ్‌పూర్ డివిజన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి ఫలితాలు మద్యాహ్నం నాటికే వచ్చాయి. కాగా 34,360 ఓట్లు పోలైన ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నాగో గనార్‌కు 8,211 ఓట్లు రాగా

Nagpur MLC Election: నాగ్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీకి దారుణ ఎదురుదెబ్బ తగిలింది. నాగ్‌పూర్ డివిజన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుంచి మహా వికాస్ అఘాడీ అభ్యర్థి విజయం సాధించారు. కేంద్రంలో కీలక మంత్రి అయిన నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్‌కు చెందిన వారే. అంతే కాకుండా బీజేపీకి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాయం ఇక్కడే ఉంది. దీంతో బీజేపీకి అత్యంత బలమైన స్థానంగా ఉన్న ఈ ప్రాంతంలో తమ అభ్యర్థి ఓటమి పాలవ్వడం కాషాయ పార్టీని కలవరానికి గురి చేస్తోంది.
Fire In Telangana New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం కేసీఆర్ సీరియస్
జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఫలితాలు శుక్రవారం విడులవుతున్నాయి. నాగ్‌పూర్ డివిజన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి ఫలితాలు మద్యాహ్నం నాటికే వచ్చాయి. కాగా 34,360 ఓట్లు పోలైన ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నాగో గనార్‌కు 8,211 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ అభ్యర్థి (కాంగ్రెస్) సుధాకర్ అద్బాలేకు 16,700 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిపై ఎంవీఏ అభ్యర్థి డబుల్ మెజారిటీతో గెలుపొందారు.