వంటింటి చిట్కాలతో ఈజీగా బాడీ పెయిన్స్ తగ్గింకోవచ్చు

  • Published By: Chandu 10tv ,Published On : September 17, 2020 / 04:15 PM IST
వంటింటి చిట్కాలతో ఈజీగా బాడీ పెయిన్స్ తగ్గింకోవచ్చు

ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానంపై ఎంతో దుష్ప్రభావం చూపుతుంది. ఈ బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, డెస్క్ జాబ్ చేసుకునేవారిలో కనిపిస్తుంటాయి. వారు ఎప్పుడు ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే ఉంటారు. దీనికి కారణం ఎప్పుడూ ప‌నిచేయ‌కుండా ఒక‌సారిగా ప‌నిచేస్తే కూడా బాడీ పెయిన్స్ వ‌స్తాయి. అనారోగ్యానికి గురైన‌ప్పుడు కూడా బాడీ పెయిన్స్ వ‌స్తాయి. అధిక వ్యాయామం చేసేవారిలోను ఈ పెయిన్స్ కనిపిస్తుంటాయి. ఈ పెయిన్స్ నుంచి రిలీఫ్ పొందటానికి పెయిన్ క్లిర్ టాబ్లెట్లును ఎక్కువగా వాడుతుంటారు. కానీ ప్ర‌తిసారీ పెయిన్ క్లిర్స్ వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ బాడీ పెయిన్స్ నుంచి తక్షణమే ఉపశమనం పొందటం కోసం కొన్ని రకాల వంటింటి చిట్కాలు పాటిస్తే చాలు.. ఈజీగా బాడీ పెయిన్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం….




అల్లం :

అల్లంను ఎన్నో సంవత్సరాల నుంచి నొప్పి, వికారం వంటి పరిస్థితులల్లో ప్రజలు వాడుతువస్తున్నారు. అల్లంలో రిచ్ ఫైటోకెమిస్ట్రీని కలిగి ఉంటుంది. అల్లం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అల్లం శక్తివంతమైన యాంటీ ఇన్ల్ఫ‌మేటరీ, అనాల్జేసిక్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. తరచుగా వచ్చే శరీర నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది.

ఒక క‌ప్పు నీటిలో కొంచెం అల్లం తురుము వేసి బాగా మిరిగించాలి. త‌ర్వ‌త చ‌ల్లార‌క‌ముందే ఈ మిశ్ర‌మం తాగాలి. రోజుకి రెండు, మూడుసార్లు అల్లం టీ తాగితే బాడీ పెయిన్స్ త‌గ్గుతాయి.




ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ,యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పి, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి, దీంతోపాటు కొంచెం తేనె వేసి సేవించాలి. అలాగే స్నానానికి వాడే నీటిలో ఆపిల్‌సిడ‌ర్ వెనిగ‌ర్ వేసి స్నానం చేస్తే కొంత తగ్గతుంది.

కోల్డ్ కంప్రెస్ :




కోల్డ్ కంప్రెస్ ద్వారా శరీర నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మత్తుమందు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శ‌రీర‌నొప్పులకు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. నొప్పిగా ఉన్న ప్ర‌దేశంలో ఐస్‌ప్యాక్‌ను 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఇలా రెండు, మూడు సార్లు చేయాలి. ఇలా త‌రుచూ చేస్తే నొప్పి త‌గ్గుతుంది.

చెర్రీస్ :




చెర్రీ జ్యూస్ నొప్పిని తగ్గించడంలో ఎంతో తోడ్పడుతుంది. కండరాల నొప్పితో పాటు పరిధీయ న్యూరోపతి చికిత్సకు చెర్రీ జ్యూస్ తరచుగా ఉపయోగిస్తారు. ప్ర‌తిరోజూ చెర్రీ జ్యూస్‌ను ఒక గ్లాస్ తీసుకుంటే మంచిది.

పసుపు :

సహజంగానే పసుపులో యాంటీ ఇన్ల్ఫ‌మేటరీ, అనాల్జేసిక్, హీలింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు యాంటీ బయాటిక్ లాగా పని చేస్తుంది. ఇది శరీర నొప్పులతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.




ఒక గ్లాసు పాల‌లో ప‌సుపు, తేనె వేసి బాగా కాలుపాలి. పాలు కొంచెం చ‌ల్లారిన త‌ర్వాత తాగితే రుచితోపాటు ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. రాత్రి ప‌డుకునే ముందు తాగితే మంచిది.

రోజ్మేరీ :




రోజ్మేరీ సారం యాంటీ ఇన్ల్ఫ‌మేటరీ, అనాల్జేసిక్ చర్యలను ప్రదర్శిస్తుంది.. శరీర నొప్పిని సహజంగా, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది.

ఆవనూనె :

ఆవ‌నూనెతో శ‌రీరాన్ని బాగా మ‌సాజ్ చేయాలి. గోరువెచ్చగా నూనెను వేడి చేసి 30 నిమిషాల పాటు బాడీని మసాజ్ చేయాలి. త‌ర్వాత స్నానం చేయాలి. ఇలా త‌రుచుగా చేస్తుంటే బాడీ పెయిన్స్ నుంచి ఉపశమనం క‌లుగుతుంది. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల బాడీ పెయిన్స్ తగ్గుతాయి.




అరటి :

శరీరంలో పొటాషియం లోపం వ‌ల్ల కూడా బాడీ పెయిన్స్ వ‌స్తాయి. ఈ లోపాన్ని నివారించటం కోసం ప్ర‌తిరోజూ అర‌టిపండ్లు తినాలి. రోజుకు 2,3 అర‌టిపండ్లు తింటే చాలా మంచిది.

దాల్చినచెక్క :




దాల్చినచెక్క ఒక మసాలా. ఇది వివిధ వంటకాల‌లో రుచి కోసం ఉపయోగిస్తారు. దాల్చిన‌చెక్క‌లో ఉండే ల‌క్ష‌ణాలు శ‌రీర నొప్పులకు చికిత్స చేయడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపర‌చ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ప్లమేటరీ, అనాల్జేసిన్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చ‌ని నీటిలో దాల్చిన చెక్క‌పొడి, కొంచెం తేనె వేసి బాగా క‌లుపాలి. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని వాడటం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.

విటమిన్ :

శరీరాన్నికి విటమిన్లు చాలా అవసరం. కొన్ని సార్లు విటమిన్లు లోపం కూడా బాడీ పెయిన్స్ వస్తాయి. విటమిన్ B1,విటమిన్ E,విటమిన్ D లోపం వల్ల కండరాల బలహీనత, శరీరం అలసిపోవటం వంటి జరుగుతాయి. ఈ విటమిన్ లోపాన్ని నివారించటం కోసం ఎక్కవగా క్యారెట్లు, ఆపిల్, ఆప్రికాట్లు, బాదం, ఆకుకూరలు, చిలగడదుంపలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవటం మంచిది.

వీటన్నింటితో పాటు రోజు 8 నుంచి 10 గ్లాసుల నీటీని తాగ్రటం మంచిది. దీనితోపాటు ధ్యానం చేయటం, మంచి నిద్రపోవటం శరీరాన్నికి చాలా అవసరం.