3D Printing Technology : కృత్రిమ చెవులు, ముక్కు..త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీతో సృష్టి

శాస్త్రవేత్తలు బాధితుల నుండి సేకరించిన మూలకణాలు, మొక్కల నుండి పొందిన నానో సెల్లూలోజ్ నుండి బయోఇంక్ లు తయారవుతాయి.

3D Printing Technology : కృత్రిమ చెవులు, ముక్కు..త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీతో సృష్టి

Invention

3D Printing Technology : మానవశరీరంలోని భాగాల్లో చెవి, ముక్కు చాలా ముఖ్యమైనవి. అనుకోని ప్రమాదాల వల్ల చెవి,ముక్కును కోల్పోతే ఇక వాటిని లేకుండా జీవితం గడపటం బాధితులకు కష్టమే.. మొఖానికి అందాన్ని ఇవ్వటంలో చెవి,ముక్కులు ప్రధానమైనవి. చేతులు, కాళ్ళు కోల్పోయిన వారికి ఆర్టిఫిషియల్ గా వాటిని ఏర్పాటు చేసే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ఇండ్లాండ్ శాస్త్రవేత్తలు శరీరలోని కొన్ని భాగాలను 3 డి ప్రిండింగ్ టెక్నాలజీ ద్వారా తయారుచేసే విధానాన్ని కనిపెట్టారు.

చెవులు, ముక్కుతోపాటు మొఖంలోని ఇతర భాగాలను 3డి ప్రింటింగ్ ద్వారా సృష్టించవచ్చని వేల్స్ లోని స్వాన్సీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ సహాయంతో కాలిన గాయాలు, క్యాన్సర్ వచ్చిన సందర్భాల్లో కలిగే గాయాల వల్ల కొంత భాగాన్ని కోల్పోయిన వారికి తిరిగి కృతిమంగా ఆప్రాంతాన్ని అమర్చేందుకు అవకాశం ఏర్పాడుతుంది.

బాధితులకు సహాయపడేందుకు స్వాన్సీ విశ్వవిద్యాలయం స్కార్ ఫ్రీ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ ఫౌండేషన్ ముఖంలోని కొంత బాగాన్ని కోల్పోయిన వ్యక్తులపై క్లీనికల్ ట్రైల్స్ లో భాగస్వామ్యం చేసింది. వీరి నుండి మూలకణాల సహాయంతో కృత్రిమ, ముక్కు, చెవులను అభివృద్ధి చేస్తోంది. తిరిగి వాటిని బాధితులకు అమర్చేందుకు అవకాశం ఉంటుంది.

శాస్త్రవేత్తలు బాధితుల నుండి సేకరించిన మూలకణాలు, మొక్కల నుండి పొందిన నానో సెల్లూలోజ్ నుండి బయోఇంక్ లు తయారవుతాయి. బయోఇంక్, 3 డి ప్రింటర్, ఆధునిక సాఫ్ట్ వేర్ ల సహాయంతో ప్రొస్థెసిస్ తయారువుతుంది. ప్రొస్థెసిస్ తయారీకి బయో ఇంక్ సురక్షితమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేదని వారంటున్నారు. ఇందుకోసం శరీరంలోని మరో భాగం నుండి చర్మాన్ని సేకరించాల్సిన అవసరం ఉండదు. రోగికి ఎలాంటి నొప్పి , బాధ లేకుండానే కృత్రిమంగా రూపొందించిన ముక్కు, చెవులను అమర్చవచ్చు.