గుడ్ న్యూస్: రోజూ 20 నిమిషాలు నడిస్తే.. 7 రకాల కేన్సర్లను తగ్గించుకోవచ్చు

రోజూ నడిస్తే మంచిదేగా? ఏంటో కొత్త న్యూస్. కొత్త స్టడీ నడకలోని మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనాన్ని బయటపెట్టింది. రోజూ నడిచే వాళ్లలో కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అని

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 05:10 AM IST
గుడ్ న్యూస్: రోజూ 20 నిమిషాలు నడిస్తే.. 7 రకాల కేన్సర్లను తగ్గించుకోవచ్చు

రోజూ నడిస్తే మంచిదేగా? ఏంటో కొత్త న్యూస్. కొత్త స్టడీ నడకలోని మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనాన్ని బయటపెట్టింది. రోజూ నడిచే వాళ్లలో కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అని

రోజూ నడిస్తే మంచిదేగా? ఏంటో కొత్త న్యూస్. కొత్త స్టడీ నడకలోని మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనాన్ని బయటపెట్టింది. రోజూ నడిచే వాళ్లలో కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అని తేలింది. ఎక్సర్ సైజెస్, ఏదో ఒక పని చేసే వాళ్లలో కేన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువని ఇంతకు ముందే మనకు తెలుసు. కాకపోతే నడకకు కేన్సర్ మధ్య సంబంధం మాత్రం ఇంతకుముందు తేలలేదు.

శారీరక శ్రమకు, కేన్సర్ కు సంబంధం:
జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురితమైన కొత్త స్టడీ ప్రకారం.. 7.5 లక్షలమంది నడక అలవాట్లను పరిశీలించారు. వాళ్లు ఎంతసేపు విశ్రాంతి తీసుకొంటారు, ఎప్పుడెప్పుడు పనిచేస్తారో తెలుసుకున్న ఏడు విభాగాలకు చెందిన సైంటిస్టులు డేటాను క్రోడీకరించారు. శారీరక శ్రమకు 15 రకాల కేన్సర్లకు మధ్యనున్న సంబంధాన్ని అర్ధం చేసుకున్నారు.

ఫలితం ఏంటి?:
సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం రెండున్నర గంటల నుంచి ఐదు గంటల సమయం మేర తేలికపాటి వ్యాయామం చేయడం మనకు మంచిది. ఒక వేళ పరిగెత్తే వాళ్లు, జిమ్ లకు వెళ్లే వాళ్లు వారానికి గంటన్నర నుంచి రెండున్నర గంటల వరకు వారంలో ఎక్సర్ సైజెస్ చేస్తే చాలంట. ఆఫీసుల్లో ఎక్కువ సేపు ఉండే వాళ్లకు పరిశోధకులు మరో సలహానిచ్చారు. ప్రతి అరగంటకు లేచి అటూ ఇటూ తిరగడం, వీలైనంతవరకు నిల్చొని పనిచేస్తే ఆరోగ్యానికి మంచిదట.

నడకతో కేన్సర్ కు చెక్:
ప్రతిరోజూ వ్యాయామం లేదంటే శారీరక శ్రమ చేసేవాళ్లలో పెద్దప్రేగు క్యాన్సర్ (colon cancer), రొమ్ము కేన్సర్ (female breast cancer), గర్భాశయ కాన్సర్ (endometrial cancer), కిడ్నీ కేన్సర్ (kidney cancer),  కాలేయం కేన్సర్ (liver cancer)ల్లో 8 నుంచి 27 శాతం వరకు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. కాకపోతే ఇక్కడ ఒక చిక్కుంది. పరిశోధకులు ఎంచుకున్న ఏడున్నర లక్షల మంది ఎప్పుడు ఎలాంటి ఎక్సర్ సైజులు చేశారో పూర్తిగా తెలియదు. వాళ్లు చెప్పింది నోట్ చేసుకొని పరిశోధకులు ఒక నిర్ణయానికి వచ్చారు. అయితేనేం, ప్రతిరోజూ నడిచేవాళ్లలో కేన్సర్ తగ్గుతుందన్న నమ్మకమైతే వాళ్లకు వచ్చింది. అదే సంగతిని జనం ముందుంచారు.

Also Read : Internet వాడుతున్నారా? మీ పిల్లలను కంట్రోల్ పెట్టండిలా!