వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ యూవీ లైట్‌తో 99శాతం వైరస్‌ను చంపేయొచ్చు!

వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ యూవీ లైట్‌తో 99శాతం వైరస్‌ను చంపేయొచ్చు!

Wearable air purifier can kill virus with UV light : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనావైరస్ వంటి ప్రాణాంతక వైరస్ లను చంపేయగల గాడ్జెట్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది.. అదే.. వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్.. ఈ పరికరాన్ని ధరించినవారు పీల్చే గాలిలో 99శాతం కంటే ఎక్కువ వైరస్, బ్యాక్టీరియాలను చంపేయొచ్చు. ఈస్టోనియన్ టెక్ కంపెనీ Respiray ఈ డివైజ్ ను రిలీజ్ చేసింది. ఈ డివైజ్‌ను ఈస్టోనియన్ విద్యా మంత్రిత్వ శాఖ మద్దతుతో ఎస్టోనియా పోలాండ్‌లోని యూనివర్శిటీలో డెవలప్ చేశారు. ముందుగా ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ డివైజ్‌ను స్కూళ్లలో ఉపాధ్యాయులకు పంపిణీ చేయనున్నట్టు కంపెనీ రెస్పిరే వెల్లడించింది.

వైరస్, బ్యాక్టీరియాలను నిర్మూలించాలంటే టీకాలు, సామాజిక దూరంతో పాటు కరోనాకు వ్యతిరేకంగా టూల్‌బాక్స్‌లో రెస్పిరే ఎయిర్ ప్యూరిఫైయర్‌లను వాడటం అదనపు భద్రతగా కంపెనీ సూచిస్తోంది. వైరస్ ను ఎదుర్కొనేందుకు ఎలాంటి మంత్రా ఆయుధం లేదు. కానీ, మహమ్మారిని నిర్మూలించడానికి ఈ డివైజ్ ఎంతో సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది. ఎయిర్ ప్యూరిఫైయర్ శ్వాస థర్మోడైనమిక్స్ మీద ఆధారపడి పనిచేస్తోందని చెబుతోంది. ఈ డివైజ్ ఒక ప్లాస్టిక్ బాక్సును కలిగి ఉంటుంది. దీన్ని మెడ చుట్టూ ధరించవచ్చు. బ్యాటరీతో పనిచేస్తుంది.

ఒక సారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు వర్క్ అవుతుంది. పీల్చిన గాలి ఫీల్టర్ అయి వెళ్తుంది. దుమ్ము, పెద్ద ధూళి కణాలను తొలగిస్తుంది. UV-C ఎల్ఈడీ మాడ్యూల్ ద్వారా వెళ్తుంది. వైరస్, బ్యాక్టీరియాను చంపేస్తుంది. పోలాండ్‌లోని లాడ్జ్ యూనివర్శిటీలో నిర్వహించిన పరీక్షల్లో E.coli, S.aureus అనే బ్యాక్టీరియాలపై 99.68శాతం, 99.88% నిర్మూలించినట్టు కంపెనీ వెల్లడించింది. ఎస్టోనియాలోని టార్టు యూనివర్శిటీలో ఆల్ఫావైరస్‌ను నియంత్రించడంలో 99.4% ప్రభావాన్ని కలిగి ఉందని రుజువైంది. ఎస్టోనియన్ రిటైలర్లు డివైజ్ కోసం ఆర్డర్లు ఇచ్చారని, మార్చిలో డెలివరీలు ప్రారంభమవుతాయని రెస్పిరే చెప్పారు. దీని రిటైల్ ధరలు 279 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది.