Hepatitis : వర్షాకాలంలో హెపటైటిస్ ప్రమాదాన్ని పెంచే కారకాలు, ఆరోగ్యకరమైన కాలేయం కోసం ?

రుతుపవనాలు హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్‌తో సహా అనేక జీర్ణశయాంతర సమస్యలకు కారణమవుతాయి. పిల్లల నుండి పెద్దలు, వృద్ధుల వరకు ఎవరైనా కాలేయ సమస్యలతో బాధపడవచ్చు. వర్షాకాలంలో కాలుష్యం వల్ల కడుపులో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. సాధారణ కడుపు ఇన్ఫెక్షన్లు విరేచనాలు , కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Hepatitis : వర్షాకాలంలో హెపటైటిస్ ప్రమాదాన్ని పెంచే కారకాలు, ఆరోగ్యకరమైన కాలేయం కోసం ?

Liver Diseases

Hepatitis : కలుషిత నీరు, ఆహారం వంటి కారణాల వల్ల వర్షాకాలంలో కాలేయ వ్యాధులతో సహా జీర్ణశయాంతర సమస్యలు పెరుగుతాయి. అందువల్ల వర్షాకాలంలో హెపటైటిస్ A, E లతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. కాలేయ సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి, అపరిశుభ్రమైన, పచ్చి ఆహారం , కూరగాయలకు దూరంగా ఉండాలి. కలుషిత నీటిని, ఆహారాన్ని తీసుకోరాదు. హెపటైటిస్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండటానికి టీకాలు వేయించుకోవటంతోపాటుగా, సమస్యలతో బాధపడుతున్న వారు డాక్టర్ సూచించిన మందులు తీసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Vemulawada Govt Hospital : వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి .. ఉయ్యాల బహుమతిగా ఇచ్చిన సూపరింటెండెంట్‌

రుతుపవనాలు హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్‌తో సహా అనేక జీర్ణశయాంతర సమస్యలకు కారణమవుతాయి. పిల్లల నుండి పెద్దలు, వృద్ధుల వరకు ఎవరైనా కాలేయ సమస్యలతో బాధపడవచ్చు. వర్షాకాలంలో కాలుష్యం వల్ల కడుపులో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. సాధారణ కడుపు ఇన్ఫెక్షన్లు విరేచనాలు , కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టైఫాయిడ్ అనేది తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది అధిక జ్వరం, కడుపు నొప్పి, వికారం , వాంతులు కలిగిస్తుంది. హెపటైటిస్ A, కామెర్లు వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. హెపటైటిస్ A అంటే కాలేయం యొక్క వాపుకు గురికావటం. పారిశుధ్యలోపం, కలుషిత నీరు, ఆహార కలుషితం వంటివి కామెర్లకు కారణం అవుతాయి. కామెర్లు వచ్చిన వారిలో పసుపు కళ్ళు, పసుపు మూత్రం, తెల్లటి మలం , కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

READ ALSO : ‘హెపటైటిస్ సి’ వైరస్ కనుగొన్న ముగ్గురికి నోబెల్ ప్రైజ్.. వారికి ఎంత వస్తుందంటే?

వర్షాకాలంలో A మరియు E వైరస్‌ల కారణంగా కాలేయ ఇన్‌ఫెక్షన్‌లు , హెపటైటిస్ కేసులు పెరుగుతున్నాయి. కలుషితమైన ఆహారం , నీరు , వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉండటం వల్ల హెపటైటిస్ A , E వస్తుంది. వీధుల్లో లభించే ఆహారాన్ని తినడం , కలుషితమైన నీటితో పండ్లను కడుక్కోవటం, జ్యూస్‌లు తాగడం , పానీ పూరీలు, కలుషిత నీటితో తయారై షర్బత్, అపరిశుభ్రమైన పచ్చి ఆహారం , కూరగాయలను తినటం వల్ల హెపటైటిస్‌ బారిన పడే అవకాశం ఉంది.. వర్షకాలంలో కాలేయం, జీర్ణకోశ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో నీరు తీసుకోవడం బాగా తగ్గిపోతుంది. ఇది కాలేయం మరియు కడుపు సంబంధిత రుగ్మతలను పెంచుతుంది. కాబట్టి సీజన్‌తో సంబంధం లేకుండా తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం.

READ ALSO : Hot Water : పొట్ట శుభ్రతకు, బరువు తగ్గేందుకు.. గోరు వెచ్చని నీరు ఎంతో మేలు

హెపటైటిస్ ఎ మరియు ఇ మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలేయం దెబ్బతింటుంది. చర్మం ,కళ్ళు పసుపు రంగులోకి మారినప్పుడు హెపటైటిస్ A మరియు E కామెర్లుగా కనిపిస్తాయి. చికిత్స తీసుకోనప్పుడు తీవ్రమైన కాలేయ వైఫల్యం, చివరికి కాలేయ మార్పిడికి దారితీసే ప్రమాదం ఉంటుంది.

READ ALSO :  Walking : మోకాలి నొప్పులతో బాధపడేవారు వాకింగ్ చెయ్యెచ్చా ?

లక్షణాల విషయానికి వస్తే ఒకరి నుండి మరొకరికి భిన్నంగా ఉంటాయి. డాక్టర్ సూచించిన మందులను మాత్రమే తీసుకోవాలి. పచ్చి ఆహారం మరియు కూరగాయలు, వీధుల్లో లభించే ఆహారాన్ని తినడం మానుకోవాలి. నీరు త్రాగే ముందు నీటిని మరిగించాలి. జ్యూస్‌లు, ఇతర పానీయాలు కలుషితమైన ఐస్ ను ఉపయోగించి తయారు చేస్తారు. అలాంటి వాటిని తీసుకోకపోవటమే మంచిది. ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవటం మర్చిపోవద్దు.