Onion : షుగర్ వ్యాధి కంట్రోల్ కు పచ్చి ఉల్లిపాయ

మనఇంట్లో వంటకు ఉపయోగించే వస్తువుల్లో పెద్ద ఉల్లిపాయలు చాలా ముఖ్యమైనవి. షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచటానికి ఈ పెద్ద ఉల్లిపాయలు ఎంతగానో దోహపడుతున్నాయి.

Onion : షుగర్ వ్యాధి కంట్రోల్ కు పచ్చి ఉల్లిపాయ

Onion

Onion : ఆహారపు అలవాట్లు, పనివత్తిళ్లు వెరసి ప్రస్తుతం ప్రపంచ జనభాలో ఎక్కువ శాతం మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ ను నియంత్రించుకోవటం కోసం కొంత మంది ఇన్సులిన్ పై ఇంజక్షన్ పై అధారపడగా, మరికొందరు నిత్యం మందులు మింగాల్సిన పరిస్ధితి..షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు ఓ ఇంటి చిట్కా చక్కగా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే వైద్యుని సలహాలు పాటిస్తూ ఈ చిట్కాను ఫాలో అయితే మంచిదని సూచిస్తున్నారు.

అదేంటంటే మనఇంట్లో వంటకు ఉపయోగించే వస్తువుల్లో పెద్ద ఉల్లిపాయలు చాలా ముఖ్యమైనవి. షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచటానికి ఈ పెద్ద ఉల్లిపాయలు ఎంతగానో దోహపడుతున్నాయి. ప్రతిరోజు 50 గ్రాముల పచ్చి పెద్ద ఉల్లిపాయ ముక్కలు తినటం ద్వారా షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. 50 గ్రాములు ఒకేసారి తినలేని వారు కొద్దికొద్దిగా ఒకరోజులో ఎదో ఒక సమయంలో తీసుకోవచ్చు.

50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 గ్రాముల ఇన్సులిన్ తో సమానం. వారం రోజుల పాటు క్రమం తప్పకుండా రోజుకు 50 గ్రాముల చొప్పున పచ్చి పెద్ద ఉల్లిపాయను తీసుకుని షుగర్ లెవల్స్ చెక్ చేసుకుని చూడండి. షుగర్ లెవల్స్ తగ్గటంతోపాటు ఎన్నో ఔషదగుణాలు ఉండటం వల్ల ఇతరత్రా వ్యాధులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

వంటింట్లో ఉండే ఉల్లిపాయను అంత తేలికగా తీసిపారేయవద్దు. దీని ద్వారా రక్తపోటు, గుండె జబ్బులు, ఆస్తమా, అలెర్జీ, ఇన్ఫెక్షన్ , జలుబు, దగ్గు, నిద్రలేమి, ఉబకాయం వంటి సమస్యలకు ఉల్లిపాయ చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది. యాంటీబయాటిక్ గా ఉపయోగపడే ఉల్లిపాయను మన రోజువారి ఆహారంలో భాగం చేసుకోవటం ఉత్తమం.