Sciatica Pain : సయాటికా నొప్పి నుండి ఉపశమనాకి ఎఫెక్టివ్ రెమెడీగా దోహదపడే పారిజాతం !

పారిజాత పువ్వుల టీ తాగడం సమస్యకు సమర్థవంతమైన పరిష్కారంగా చెప్పవచ్చు. పారిజాత పువ్వుల టీ మీ శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. సయాటిక్ నరాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది నరాలను శాంతపరుస్తుంది. నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. సయాటికా నొప్పుల నివారణకు పారిజాత పువ్వులు, ఆకులతో తయారు చేసుకున్న టీ తాగలి.

Sciatica Pain : సయాటికా నొప్పి నుండి ఉపశమనాకి ఎఫెక్టివ్ రెమెడీగా దోహదపడే పారిజాతం !

Harshringar leaves to fight sciatica

Updated On : May 13, 2023 / 10:09 AM IST

Sciatica Pain : సయాటికా సమస్య అనేది సాధారణంగా వెన్నెముకలోని డిస్క్ , స్పర్ నరాల మీద ఒత్తిడి కారణంగా వెన్నునొప్పికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి శరీరంలోని కింది భాగానికి కూడా చేరి చివరకు నడవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితి నుండి ఉపశమనం కలిగించేందుకు ఆయుర్వేదంలో ప్రభావవంతంగా పనిచేసే ఒక ఔషధం ఉంది. అదే పారిజాత పుష్పాలు. వాస్తవానికి పారిజాత పువ్వులు, ఆకులను ఉపయోగించడం అన్నది సయాటికా నొప్పికి సమర్థవంతమైన నివారణగా చెప్పవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Binge Eating Disorder : రోజంతా అదేపనిగా తింటూనే ఉంటున్నారా? ఇది ఇతర అనారోగ్యాలకు ఎలా కారణమవుతుందంటే ?

సయాటికా నొప్పి నివారిణిగా పారిజాత పువ్వులను ఎలా ఉపయోగించాలి?

1. సయాటికా నొప్పిని తగ్గించే పారిజాతపువ్వుల ఆయిల్ ; సయాటికానొప్పిని తగ్గించటంలో పారిజాతపువ్వులతో తయారైన ఆయిల్ పూయడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి గాను చేయాల్సిందల్లా పారిజాత పువ్వులు, ఆకులను తీసుకొని వాటిని లవంగం, ఆవాల నూనెతో ఉడికించాలి. తర్వాత ఈ నూనెను నొప్పి ఉన్న చోట రాసుకోవాలి. ఇది వాపును తగ్గించడంతో పాటు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

2. పారిజాత పువ్వుల టీ ; పారిజాత పువ్వుల టీ తాగడం సమస్యకు సమర్థవంతమైన పరిష్కారంగా చెప్పవచ్చు. పారిజాత పువ్వుల టీ మీ శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. సయాటిక్ నరాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది నరాలను శాంతపరుస్తుంది. నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. సయాటికా నొప్పుల నివారణకు పారిజాత పువ్వులు, ఆకులతో తయారు చేసుకున్న టీ తాగలి.

READ ALSO : Parijata : దేవుని పూజకే కాదు, నొప్పుల నివారణలో ఔషధంగా పారిజాతం?

3. పారిజాత ఆకుల రసం ; పారిజాత ఆకుల రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే సయాటికా సమస్య తగ్గుతుంది. ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాలకు ఉపశమనం కలిగిస్తాయి. వెన్నునొప్పిని క్రమంగా తగ్గిస్తాయి.

సయాటికా నివారణకు పారిజాతంతో ప్రయోజనాలు :

సయాటికా నివారణలో పారిజాతం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నరాలను శాంతపరచి, వాపును తగ్గిస్తాయి. ఇది ఆర్థరైటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే, ఇది నొప్పిని నివారిస్తుంది. అనేక నరాల సమస్యలను తొలగిస్తుంది.

READ ALSO : పారిజాతం ఆకులతో ప్రయోజనాలెన్నో.. అనేక వ్యాధులకు చెక్

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ రూపాల్లో సేకరించి అందిచటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.