Pfizer COVID-19 Vaccine : ఫైజర్ వ్యాక్సిన్.. ఫ్రిడ్జ్‌లో నెల వరకు స్టోర్ చేయొచ్చు..
అమెరికాకు చెందిన ఫైజర్ ఇంక్, జర్మనీ భాగస్వామి బయోంటెక్ SE కొవిడ్-19 వ్యాక్సిన్‌ను నెల రోజుల వరకు ప్రామాణిక ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయొచ్చునని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.

Pfizer Covid 19 Vaccine Can Be Stored In Refrigerator For A Month
Pfizer COVID-19 vaccine store refrigerator : అమెరికాకు చెందిన ఫైజర్ ఇంక్, జర్మనీ భాగస్వామి బయోంటెక్ SE కొవిడ్-19 వ్యాక్సిన్‌ను నెల రోజుల వరకు ప్రామాణిక ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయొచ్చునని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. టీకా ఓపెన్ చేయని ఫైజర్ వ్యాక్సిన్ల సీసాలను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద రిఫ్రిజిరేటర్లో ఒక నెల వరకు నిల్వ చేయవచ్చునని ఈయూ డ్రగ్ రెగ్యులేటర్ పేర్కొంది. గతంలో అతిశీతల ఉష్ణోగ్రతల్లో మాత్రమే ఐదు రోజుల వరకే గరిష్ట పరిమితి ఉండేది.
ఇప్పుడు ఈ ఫైజర్ వ్యాక్సిన్ స్టోర్ చేయడానికి, టీకా సరఫరా చేయడానికి వీలుగా టీకా నియమాన్ని మార్చేసింది. వ్యాక్సిన్ స్టోరేజ్ సమయాన్ని పెంచాలని, తద్వారా టీకా సరఫరా కూడా వేగవంతం అవుతుందని తెలిపింది. ఫైజర్ టీకాలను అతిశీతల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయడం ఇబ్బందికరంగా మారింది. ఫైజర్ టీకాలను కొన్ని దేశాలకు తీసుకువెళ్లే సమయంలో ఫైజర్ స్టోరేజీకి ఫ్రీజర్ల అవసరం పడటంతో ఇబ్బందులు తలెత్తాయి. సాధారణంగా ఫైజర్ వ్యాక్సిన్ -80ºC -60ºC (-112ºF నుంచి -76ºF) మధ్య ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. దీనిని ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో రవాణా చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడా పరిస్థితి లేదంటోంది. తొలుత మైనస్ 80 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నిల్వ చేయాలనే నియమం ఉంది. మైనస్ 25C ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేయాలని అమెరికా కంపెనీ వెల్లడించింది. రవాణా, నిల్వ మౌలిక సదుపాయాలు లేని గ్లోబల్, రిమోట్ అమెరికా సౌకర్యాలకు ఈ మార్పు చాలా ముఖ్యమని తెలిపింది. ఫైజర్ టీకాలను 12 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలకు ఇచ్చేందుకు కెనడా ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరిలో, యుఎస్ హెల్త్ ఏజెన్సీ అల్ట్రా-కోల్డ్ పరిస్థితులకు బదులుగా రెండు వారాల వరకు ప్రామాణిక ఫ్రీజర్ ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్ నిల్వతో పాటు రవాణాను ఆమోదించింది. టీకాను నెల వరకు ప్రామాణిక రిఫ్రిజిరేటెడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడానికి ఆమోదించినట్లు హెల్త్ కెనడా తెలిపింది. ఈ టీకాకు డిసెంబరులో అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేసింది.