Sore Throat : గొంతు నొప్పితో బాధపడుతున్నారా ? ఈ నీరు గ్లాసు చాలు..

వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్రిమినాశక గుణాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లను నయం అవుతాయి. గొంతు నొప్పి నుండి బయటపడటానికి, మూడు నుండి నాలుగు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి.

Sore Throat : గొంతు నొప్పితో బాధపడుతున్నారా ? ఈ నీరు గ్లాసు చాలు..

sore throat

Sore Throat : వాతావరణం మారుతోంది. వర్షకాలం సీజన్ నుండి శీతాకాలంలోకి ప్రవేశిస్తున్న ఈ సమయంలో, జలుబు, దగ్గు , గొంతు ఇన్ఫెక్షన్లు సర్వ సాధారణం. ఇలాంటి వాతావరణంలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. సాధారణంగా శీతాకాలంలో గొంతు మంట,నొప్పి సమస్యకు జలుబు, దగ్గు కారణంగా వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో, బ్యాక్టీరియా వల్ల కూడా గొంతునొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

READ ALSO : Fatty Liver Disease : ప్రాణాలు తీస్తున్న ఫ్యాటీ లివర్‌ ఇకనైనా జాగ్రత్త పడండి

గొంతునొప్పి వల్ల ఏదైనా మింగడానికి కష్టంగా ఉంటుంది. గొంతులో నిరంతరం నొప్పి తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మందులు వేసే బదులు, సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా గొంతు నొప్పికి చికిత్స చేయడం మంచిది. సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గొంతు ఇన్ఫెక్షన్ నుండి బయటపడేందుకు అనుసరించాల్సిన ఇంటి చిట్కాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

గొంతు నొప్పికి చికిత్స గ్లాసుల నీరు చాలు :

ఉప్పు నీరు :

ఉప్పు నీళ్లతో పుక్కిలిస్తే గొంతు ఇన్ఫెక్షన్ దాని వల్ల కలిగే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీళ్లతో పుక్కిలించడం వల్ల బ్యాక్టీరియా ప్రభావం తగ్గి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలియబెట్టి ఆనీటితో పుక్కిలించండి. ఇలా 5-7 నిమిషాల పాటు పుక్కిలించాలి. రాత్రిపూట ఇలా చేయడం వల్ల గొంతునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

READ ALSO : Heart Health : రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలు.. గుండె ఆరోగ్యం భేష్

పసుపునీరు ;

పసుపులో యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అందుకే దీనిని ఇన్ఫెక్షన్లను నయం చేసే ఔషధంగా చెప్పవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్ , కఫం నుండి బయటపడటానికి అర టీస్పూన్ పసుపును వేడి పాలలో లేదంటే వేడి నీటిలో కలిపి త్రాగాలి. రాత్రిపూట ఇలా చేయడం వల్ల గొంతునొప్పి నుండి బయటపడవచ్చు.

READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

గొంతు నొప్పి నుండి ఉపశమనానికి ఇతర గృహ నివారణ చిట్కాలు ;

ఆవిరి పట్టటం ;

ఎగువ శ్వాసనాళంలో శ్లేష్మంతో పాటు ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియాను తొలగించటానికి ఆవిరి పట్టటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవిరిని పీల్చుకోవాలనుకుంటే ఒక పాత్రలో నీటిని బాగా మరగించాలి. తలను టవల్‌తో కప్పి ఆవిరి వస్తున్న పాత్రకు దగ్గరగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ వేడి ఆవిర్లను ముక్కు, నోటి ద్వారా పీల్చాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

READ ALSO : Drinking Alcohol : ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం మరింత డేంజర్ లో పడ్డట్టే !

వెల్లుల్లి ;

వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్రిమినాశక గుణాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లను నయం అవుతాయి. గొంతు నొప్పి నుండి బయటపడటానికి, మూడు నుండి నాలుగు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి. ఇది గొంతు ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనాన్ని కలిగించటంతోపాటు జీర్ణవ్యవస్థకు కూడా మంచిది.

గమనిక ; ఈ సమాచారాన్ని అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో సేకిరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి చికిత్స పొందటం మంచిది.