Antidepressants : దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో యాంటిడిప్రెసెంట్స్ పాత్రపై తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే ?
దీర్ఘకాలిక నొప్పి, లేదా మూడు నెలల కంటే ఎక్కువ ఉండే ఏ రకమైన నొప్పి తో అయినా బాధడుతుంటే అటువంటి సందర్భాలలో దీర్ఘకాలంగా సూచించబడిన ఓపియాయిడ్లు రోగులకు సిఫార్సు చేయబడవు. ఎందుకంటే ఇవి ఒకరకంగా ప్రమాదకరమైనవి.

Antidepressants
Antidepressants : దీర్ఘకాలిక నొప్పికి వ్యతిరేకంగా పనిచేయటంలో యాంటిడిప్రెసెంట్స్ ప్రభావవంతంగా తోడ్పడతాయన్న విషయంపై తక్కువ ఆధారాలు ఉన్నాయి, ఈ అంశంపై నిర్వహించిన అతిపెద్ద అధ్యయనం వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. అయితే దీనిపై అధ్యయనం నిర్వహించిన బ్రిటిష్ పరిశోధకులు ఒక సూచన కూడా చేశారు. ప్రస్తుతం ఎవరైతే రోగులు మందులు వాడుతున్నారో వాటిని ఆపకూడదని నొక్కిచెప్పారు. అదే సమయంలో దీనిపై ముందుగా వారు చికిత్స పొందుతున్న వైద్యులతో మాట్లాడాలంటూ సలహా ఇచ్చారు.
READ ALSO : High Cholesterol : గుండెను కాపాడుకోవటానికి ఈ విషయాలు గుర్తుంచుకోండి !
దీర్ఘకాలిక నొప్పి, లేదా మూడు నెలల కంటే ఎక్కువ ఉండే ఏ రకమైన నొప్పి తో అయినా బాధడుతుంటే అటువంటి సందర్భాలలో దీర్ఘకాలంగా సూచించబడిన ఓపియాయిడ్లు రోగులకు సిఫార్సు చేయబడవు. ఎందుకంటే ఇవి ఒకరకంగా ప్రమాదకరమైనవి. మానసిక స్థితిని ప్రభావితం చేసే మెదడులోని రసాయనాలు నొప్పిని కూడా ప్రభావితం చేస్తాయనే ఆశతో దీర్ఘకాలిక నొప్పి రోగులకు యాంటిడిప్రెసెంట్స్ మందులను వైద్యులు సూచిస్తున్నారు. అయితే మొదటిసారిగా ఈ అంశానికి సంబంధించిన అన్ని పరిశోధనలను మూల్యాంకనం చేసిన కొత్త అధ్యయనం దీర్ఘకాలిక నొప్పికి వ్యతిరేకంగా దాదాపు అన్ని యాంటిడిప్రెసెంట్‌ల ప్రభావం వల్ల కలిగే ప్రయోజనాల ఖచ్ఛితత్వాన్ని కనుగొనలేకపోయాయి.
యూకే విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు 176 ట్రయల్స్‌ను పరిశీలించారు, ఇందులో దాదాపు 30,000 మంది రోగులు తమ దీర్ఘకాలిక నొప్పికి 25 విభిన్న యాంటిడిప్రెసెంట్‌లను తీసుకున్నారని చెప్పారు. స్వల్పకాలిక నొప్పి ఉపశమనం కోసం ఒక యాంటిడిప్రెసెంట్, డులోక్సేటైన్ యొక్క సమర్థతపై మాత్రమే వారు నమ్మకంగా ఉన్నారు. ఇది ఫైబ్రోమైయాల్జియాతో పాటు మస్క్యులోస్కెలెటల్,నరాల నొప్పికి సమానంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నప్పటికీ , దీర్ఘకాలిక దుష్ప్రభావాలపై పూర్తిస్ధాయి సమాచారం లేదని పరిశోధకులు తెలిపారు.
మరో యాంటిడిప్రెసెంట్, మిల్నాసిప్రాన్ కూడా నొప్పిని తగ్గించగలదు. అయితే దీనికి సంబంధించి ఖచ్ఛితత్వంపై తక్కువ అధ్యయనాలు అందుబాటులో ఉన్నందున పరిశోధకులకు నమ్మకం తక్కువగా ఉంది. దీర్ఘకాలిక నొప్పికి సాధారణంగా సూచించబడిన యాంటిడిప్రెసెంట్‌లలో ఒకటైన అమిట్రిప్టిలైన్ యొక్క ప్రభావం ఎంత, సురక్షితంగా ఉందో అంచనా వేయలేమని పరిశోధకులు స్పష్టం చేశారు. దీనికి ముఖ్యంగా నమ్మదగిన సాక్ష్యం లేకపోవడమే కారణం.
అధ్యయన బృందానికి చెందిన UKలోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన తమర్ పింకస్, వైద్యులు అమిట్రిప్టిలైన్‌ను అలవాటు చేయడం చాలా సులభం అని అన్నారు. ఎందుకంటే దీర్ఘకాలిక నొప్పి ఉన్న ముగ్గురిలో ఒకరు ప్లేసిబోస్‌కు సానుకూల ప్రతిస్పందన ఉండటమే. దీనిని ఉపయోగించిన రోగుల నుండి వారి వైద్యులు ఔషధం యొక్క అద్భుతమైన ఫలితాలను తెలుసుకుని ఉండటమేనని తమర్ పింకస్ అన్నారు.
READ ALSO : Kidney Health In Summer : వేసవిలో కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమైన జీవనశైలి మార్పులు ఇవే !
అదే క్రమంలో రోగులు అకస్మాత్తుగా యాంటిడిప్రెసెంట్స్ తీసుకోవడం మానేయడం నిజంగా ప్రమాదకరం అని పింకస్ పేర్కొన్నారు. దీనిపై ఇంకా మెరుగైన పరిశోధనలు జరగాలని పరిశోధకులు పింకస్ పిలుపునిచ్చారు. అదే క్రమంలో పరిశోధనలో పాలుపంచుకోని కింగ్స్ కాలేజ్ లండన్‌లోని నొప్పి పరిశోధకుడు ర్యాన్ పటేల్, రోగులకు యాంటిడిప్రెసెంట్స్ తీసుకోవడం కొనసాగించమని కూడా సలహా ఇచ్చారు.