కేసీఆర్..దమ్ముందా : మేం పాండవులం గెలుపు కాంగ్రెస్ దే 

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 07:35 AM IST
కేసీఆర్..దమ్ముందా : మేం పాండవులం గెలుపు కాంగ్రెస్ దే 

హైదరాబాద్ : హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై పోరాడే దమ్ము మాత్రం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఆయన డబ్బుతో వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలే అంటూ కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని..మహాభారతంలో నూరుగురు వ్యక్తులు ఉన్నవారు కౌరవులైతే..ఐదుగురు ఉన్నవారు పాండవులనీ..కౌరవులు తాత్కాలికంగా గెలిచినా చివరకు న్యాయంగా గెలిచేది పాండవులేనని..పాండవుల మాదిరిగానే కాంగ్రెస్ కూడా విజయం సాధిస్తుందని రేవంత్ ధీమా వ్యక్తంచేశారు. పాండవులకు..కౌరవులకు తేడా తెలియకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. 
Read Also :నరసాపురం టూ భీమవరం : అన్నయ్య పార్లమెంట్.. అసెంబ్లీకి తమ్ముడు.. రీజన్ ఇదే

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అధ్యక్షుడు..సీఎం కేసీఆర్ పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎల్బీ నగర్ పరిధిలో ప్రచారం సందర్భంగా సీఎం కేసీఆర్ రేవంత్ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..కేసీఆర్ కు దమ్ము..ధైర్యం ఉంటే తనకు వ్యతిరేకంగా మల్కాజ్ గిరి నియోజకవర్గం వర్గం నుంచి పోటీ చేయమని సవాల్ చేశారు.

నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి ఓటు చేస్తే రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని రేవంత్ ధీమా వ్యక్తంచేశారు.  కేసీఆర్ మొదటిసారి గెలిచి నియంతృత్వ పాలన చేస్తే.. రెండోసారి గెలిచి అరాచక పాలన చేస్తున్నారని..ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోవడం మంచిది కాదన్నారు. అది నియంతృత్వానికి దారి తీస్తుందని హెచ్చరించారు. 
Read Also :మెగా టీం : జనసేనలోకి నాగబాబు – నరసాపురం ఎంపీగా పోటీ