టీడీపీని పెట్టింది నేనే : నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ’తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీఆర్ కాదు నేనే’ అని అన్నారు.

  • Published By: sreehari ,Published On : December 30, 2018 / 08:07 AM IST
టీడీపీని పెట్టింది నేనే : నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ’తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీఆర్ కాదు నేనే’ అని అన్నారు.

హైదరాబాద్ : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ’తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీఆర్ కాదు నేనే’ అని అన్నారు. ’ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది నేను కాదు చంద్రబాబు’ అని ఆరోపించారు. ఈ మేరకు నాదెండ్ల హైదరాబాద్ లో టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే
తన ఇంట్లోనే టీడీపీ పార్టీ పెట్టాను అని..ఎన్టీఆర్ కు ఏమీ తెలియదన్నారు. రామారావును తాను ఎప్పుడూ చూడలేదని..ఆయన తనను ఎప్పుడైనా చూశాడో లేదో తెలియదని తెలిపారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది తాను కాదు చంద్రబాబే అని ఆరోపించారు. 

ఎన్టీఆర్ కు భోజనం పెట్టకుండా చంపేశారు
’బ్యాంకులో ఎన్టీఆర్ ఖాతాలోని డబ్బు కూడా లాక్కున్నారు. పార్టీ లాక్కున్నారు. చీఫ్ మినిస్టర్ పదవి లాక్కున్నారు. నాయకత్వం ఎవరంటే చంద్రబాబు..చంద్రబాబు నాయకత్వంలో ఫ్యామిలీ అంతా ఏకమై..వాళ్లళ్లో తగవులున్నా కూడా మళ్లీ కలిపేసుకుని, ఒకటిగా ఉండి..రామారావుకు భోజనం కూడా పెట్టకుండా చంపేశారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

నా పాత్రను నెగెటివ్ గా చూపిస్తే పోరాడుతా
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో తన పాత్రను నెగెటివ్ గా చూపిస్తే న్యాయపరంగా పోరాడుతానని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంలో బాలకృష్ణకు నోటీసులు కూడా పంపామని తెలిపారు. ఎవరు తీసిన సినిమా అయినా సరే తనను విలన్ గా చూపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వాస్తవాలు చూపించాలని కోరుతున్నానని అన్నారు. 

వర్మ ట్వీట్ పై ఫైర్
’ఎన్టీఆర్ కు నాదెండ్ల భాస్కర్ రావు నమ్మకం ద్రోహం చేశారని. అతని కొడుకు మనోహర్ రావు కూడా అదే బాటలో కొనసాగుతున్నాడు’ అంటూ ఇటీవల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ కూడా చేశాడు. దీనిపై అడగ్గా…రామ్ గోపాల్ వర్మ అలా ట్వీట్ చేయడం సరైంది కాదన్నారు. అతను అలా మాట్లాడటం తప్పు…ఇతరుల హృదయాలను గాయపర్చడం భావ్యం కాదని హితవు పలికారు. తెలివి తక్కువ మాటలు మాట్లడటం సరికాదన్నారు.