హైదరాబాద్ లో మందుబాబులకు షాక్ : కొత్త ట్రాఫిక్ జరిమానాలు అమలు.. రూ.10వేల 500 ఫైన్

హైదరాబాద్ ప్రత్యేక కోర్టు మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఇంకా అమల్లోకి రాని కొత్త మోటార్ వాహన చట్టాన్ని కోర్టు అమలు చేసింది. డ్రంకెన్ డ్రైవ్ లో

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 03:17 AM IST
హైదరాబాద్ లో మందుబాబులకు షాక్ : కొత్త ట్రాఫిక్ జరిమానాలు అమలు.. రూ.10వేల 500 ఫైన్

హైదరాబాద్ ప్రత్యేక కోర్టు మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఇంకా అమల్లోకి రాని కొత్త మోటార్ వాహన చట్టాన్ని కోర్టు అమలు చేసింది. డ్రంకెన్ డ్రైవ్ లో

హైదరాబాద్ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్ కోర్టు మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఇంకా అమల్లోకి రాని కొత్త మోటార్ వాహన చట్టాన్ని కోర్టు అమలు చేసింది. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 9 మంది వాహనదారులకు రూ.10,500 చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు గురువారం(అక్టోబర్ 03,2019) ఉత్తర్వులు జారీ చేసింది. వీకెండ్ లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. మందు తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జరిమానాను న్యాయమూర్తి విధించారు. మోటారు వాహన సవరణ చట్టంలోని నిబంధనలను పరిశీలించి ఎం.వి.చట్టం 185(ఎ) ప్రకారం కొత్త జరిమానా విధించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఫలక్‌నుమా, బహదూర్‌పుర, సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో పట్టుబడిన 9 మందికి రూ.10,500 చొప్పున నాంపల్లి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ట్రాఫిక్‌ మొబైల్‌ కోర్టు ఫైన్ విధించింది. 

కాగా.. తెలంగాణలో ఇంకా కొత్త మోటార్ వాహన చట్టం అమల్లోకి రాలేదు. అయినా డ్రంకెన్ డ్రైవ్ కేసులో కోర్టు.. కొత్త జరిమానాలు వేయడం సంచలనంగా మారింది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో కోర్టులకు సంబంధం ఉండదన్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి జరిమానా, జైలు శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉందని.. దేశంలో ఎక్కడైనా కొత్త జరిమానాలను విధించొచ్చని ట్రాఫిక్ పోలీసులు వివరించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చినా.. తెలంగాణలో మాత్రం ఇంకా రాలేదు. కొత్త మోటార్ వాహన చట్టంలో ఫైన్లు ఎక్కువగా ఉన్నాయని, వాహనదారులకు పూర్తి అవగాహన కల్పించాక అమలు చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. అప్పటి వరకు కొత్త మోటార్ వాహన చట్టం అమల్లోకి రాదు అని అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం కేసీఆర్ హామీతో వాహనదారులు రిలీఫ్ పొందారు. అయితే సడెన్ గా.. హైదరాబాద్ ప్రత్యేక కోర్టులు కొత్త జరిమానాలు అమలు చేయడంతో షాక్ తిన్నారు. ఊహించని పరిణామంతో బిత్తరపోయారు. ఇకపై వాహనదారులు అలర్ట్ గా ఉండాలని.. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే.. భారీ ఫైన్లతో పాటు జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

ఇక సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నాలుగు రోజుల నుంచి డ్రంకెన్‌ డ్రైవర్లకు రూ.5 వేల జరిమానా విధిస్తున్నారు. కూకట్‌పల్లిలోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 50 మందికి రూ. 5 వేల చొప్పున జరిమానా విధించిందని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో రూ.10,500 జరిమానా తొలిసారిగా 9 మందికి విధించడంతో అక్కడా ఈ విధానాన్ని ఆయా కోర్టులు అమలు చేసే అవకాశముందని భావిస్తున్నారు. కొత్త జరిమానాల వల్ల డ్రంకన్‌ డ్రైవ్‌లు, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్‌ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ఛార్జీషీటు ఓపెన్ చేశారు. సుల్తాన్ బజార్, ఫలక్ నుమా, బహదూర్ పుర పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రైవ్ లో 9మంది వాహనదారులు పట్టుబడ్డారు. మోటార్ వాహన చట్టం 185 కింద పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. 9 మందిలో ముగ్గురు ఫలక్ నుమా, ముగ్గురు బహదూర్ పుర, ముగ్గురు సుల్తాన్ బజార్ కి చెందిన వాళ్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. మందుబాబులకు భారీ ఫైన్ వేయడంతో పాటు.. రెగులర్ కౌన్సిలింగ్ ఉంటుందని పోలీసులు తెలిపారు. సో.. మద్యం తాగి వాహనం నడిపే వారు.. ఇక ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే.