GHMC : వర్షాల ప్రభావం .. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు

ఎంతో అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు అధికారులు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు అధికారులు సూచించారు.

GHMC : వర్షాల ప్రభావం .. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు

GHMC employees leave cancellation

GHMC employees leave cancelled : కొన్ని రోజులుగా వర్షాలు ఏకధాటిగా కురుస్తునే ఉన్నాయి. దీంతో హైదరబాద్ నగరమంతా వర్షంలో తడిసిముద్దవుతోంది. ఇక ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవు. భారీ వర్షాలతో నగరంలోకి కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జోన్ల వారీగా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో నగరవ్యాప్తంగాను, మరీ ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కుకట్ పల్లి ప్రాంతంలో ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటించారు. ఎంతో అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చిరించారు అధికారులు.

ఈ భారీ వర్షాల ప్రభావంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కానీ జీహెచ్ఎంసీ ఉద్యోగులకు మాత్రం సెలవుల్ని రద్దు చేసింది. ఈరోజు, రేపు కూడా అంటే బుధవారం(జులై 26,27,2023)సెలవుల్ని రద్దు చేసింది. అత్యవసరం అయితే తప్ప సెలవురు తీసుకోవద్దని సూచించారు జీహెచ్ఎంసీ కమిషనర్. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించటంలో సెలవులు రద్దు చేయాల్సి వచ్చిందని కమిషన్ వెల్లడించారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

 

భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో మేయర గద్వాల విజయలక్ష్మి అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. నగర వ్యాప్తంగా ఆయా జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల పరిధిలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి అత్యవసరం అయితే తప్ప సెలవులు ఇవ్వవద్దని మేయర్‌ ఆదేశాలు జారీ చేశారు.

రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించిన క్రమంలో నగరంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే నగరవాసులు తమ తమ ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.