ఓటర్ల పల్లెబాట : బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఎలక్షన్ రద్దీ

నగరంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు వివిధ కారణాలతో హైదరాబాద్‌లో ఉంటున్న వారిలో చాలామందికి ఇప్పటికీ తమ ఊర్లలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 05:56 AM IST
ఓటర్ల పల్లెబాట : బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఎలక్షన్ రద్దీ

నగరంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు వివిధ కారణాలతో హైదరాబాద్‌లో ఉంటున్న వారిలో చాలామందికి ఇప్పటికీ తమ ఊర్లలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

హైదరాబాద్ ఓటర్లు పల్లెబాట పట్టారు. ముఖ్యంగా ఏపీకి రద్దీ పెరిగింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. లక్షల మంది ఓటర్లు.. ఏపీలోని తమ స్వగ్రామాల్లో ఓటు వేసేందుకు వెళుతున్నారు. దీంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నారు. ఆర్టీసీలో ఫుల్. ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలు అమాంతం పెంచేశారు. ప్రత్యేక బస్సులు వేసినా సరిపోవటం లేదు. మరికొందరు సొంత వాహనాల్లో వెళుతున్నారు. 
Read Also : జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారు: నారా రోహిత్

సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే ఈస్థాయిలో సొంతూరికి వెళ్లేవారు. ఇప్పుడు అది రిపీట్ అవుతుంది. ఏపీలో పార్టీల గెలుపోటములు కీలకంగా మారాయి. దీంతో పోటీలోని అభ్యర్థులు స్వయంగా ఫోన్ చేస్తున్నారు. వచ్చి ఓటు వేసి వెళ్లండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓటర్లు కూడా తమ ఓటును అభిమాన పార్టీలకు వేయాలని గట్టిగా నిర్ణయించుకుని వెళుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి లక్షల మంది పల్లెబాట పట్టారు. హైవేలపై రద్దీ ఏర్పడింది. 

తెలంగాణలో పార్లమెంట్, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఉండటంతో.. ఈసారి హైదరాబాద్ నుంచి ఏపీతోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కనీసం 10 నుంచి 12 లక్షల వరకు ఈ సంఖ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో జాతీయ రహదారులపై రద్దీ బాగా పెరుగుతుంది. టోల్ గేట్ల దగ్గర కూడా టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు.
Read Also : జగన్ హామీ : లోకేష్‌పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి