జెండాకు అవమానం : ఓయూలో తిరగేసి ఎగరేశారు

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 06:56 AM IST
జెండాకు అవమానం : ఓయూలో తిరగేసి ఎగరేశారు

హైదరాబాద్ : శతాబ్ది ఉత్సవాలు చేసుకుని అత్యంత ప్రతిష్టాత్మక వర్శిటీగా పేరొందిన ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభోగంగా జరుగుతున్నవేళ ఉస్మానియాలో రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ పై యూనివర్శిటీ అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతేకాదు  జాతీయ జెండా చిరిగిపోయి ఉండటం కలకలం రేపింది. ఈ విషయాన్ని గుర్తించిన స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. జెండా ఎలా ఉందో కూడా చూసుకోకుండా, నిర్లక్ష్యంగా ఎగురవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ  క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందనే భయంతో ఓయూ అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలను చేపట్టారు. మరో జెండాను తెప్పించి.. అప్పటికప్పుడు హడావిడిగా ఎగురవేశారు. ఈ క్రమంలోనే దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పండుగను ఓయూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనీ..ఈ సందర్భంగా చేసిన  ఏర్పాట్లు కూడా సరిగా లేవంటూ స్టూడెంట్ విమర్శిస్తున్నారు. జెండా చిరిగిపోవడంపై ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. జెండా ఎగురవేస్తున్న తరుణంలోనే తీవ్రమైన గాలికి హుక్కు పట్టుకొని జెండా చిరిగిందని…అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా కాదని తెలిపారు.  

 

ఎట్టి పరిస్థితులలోనైనా జాతీయ జెండా చినిగిపోయినా..లేదా పాడైపోయినా..ఆ జెండాలను ఒక ప్రత్యేక పద్దతి ద్వారా నిక్షిప్తం చేయాలి. పాడయిన లేదా చిరిగిపోయిన జెండాలను పక్కన పడెయ్యటం లేదా అగౌరవంగా నాశనం చేయకూడదు. అలాంటి వాటిని కాల్చవేయటంగానీ..లేదా భూమిలో పాతిపెట్టడం చేయాలి. లేదా జెండాను అవమానించినట్లేనని నిబంధనలు తెలుపుతున్నాయి.