‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై NHRC ఎంక్వైరీ

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై NHRC ఎంక్వైరీ

దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై పోలీసులకు ప్రశంసలు దక్కుతున్నాయి. మరో వైపు మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్ఆర్సీ)దీనిపై సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక బృందాన్ని పంపాలని డీజీపీకి ఆదేశం ఇచ్చింది. 

అత్యవసర దర్యాప్తుతో సమాచారం రాబట్టాలని, వీలైనంత త్వరగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఎన్‌హెచ్‌ఆర్సీ. శుక్రవారం 3గంటల 30నిమిషాలకు షాద్ నగర్ వద్ద నిందితులపై ఎన్‌కౌంటర్‌ జరిపారు తెలంగాణ పోలీసులు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు) చటాన్ పల్లి వద్దకు తీసుకొచ్చారు. 

పోలీసులపైకి నిందితులు దాడికి యత్నించడంతో పాటు పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారిని  పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్లు సమాచారం. ఐదుగురు వైద్యుల బృందంతో ఘటనా స్థలిలో నిందితులకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. క్లూస్ టీమ్ నిందితుల ఆధారాలు సేకరించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మహబూబ్‌నగర్‌కు తరలించనున్నారు.