మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

  • Published By: chvmurthy ,Published On : January 7, 2020 / 04:10 PM IST
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడదలైంది. రాష్ట్రంలోని 9 కార్పోరేషన్లు లోని 325 కార్పోరేటర్ స్థానాలకు, 120 పురపాలక సంఘాల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం  కమీషనర్ నాగిరెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ  …షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 

మున్సిపల్ ఎన్నికలకు  జనవరి 8 నుంచి 10 వతేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.   జనవరి 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్లు ఉపసంహరణ గడువు జనవరి 14 వతేదీ వరకు ఉంది.జనవరి 22న పోలింగ్ నిర్వహించి.. జనవరి 25ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.