ఉద్యమం ఉధృతం : ఆర్టీసీ జేఏసీ కార్యచరణ ఇదే..చలో ట్యాంక్ బండ్

  • Published By: madhu ,Published On : November 2, 2019 / 09:44 AM IST
ఉద్యమం ఉధృతం : ఆర్టీసీ జేఏసీ కార్యచరణ ఇదే..చలో ట్యాంక్ బండ్

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడంతో సమ్మె ఎప్పుడు ముగుస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కోర్టులో దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. నవంబర్ 07వ తేదీకి విచారణ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019, నవంబర్ 02వ తేదీ శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. నవంబర్ 03వ తేదీ ఆదివారం నుంచి నవంబర్ 09వ తేదీ శనివారం వరకు షెడ్యూల్ ప్రకటించింది. దశల వారీగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేబినెట్‌లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే..కార్యక్రమాల మార్పు చేయాలని నేతలు నిర్ణయించారు. 

> నవంబర్ 03వ తేదీన అమరుల కోసం పల్లెబాట, సమావేశాలు.
> నవంబర్ 04వ తేదీన రాజకీయ పార్టీలతో కలిసి డిపోల వద్ద నిరహార దీక్షలు.
> నవంబర్ 05వ తేదీన రహదారి దిగ్భందం కార్యక్రమం.
> నవంబర్ 06వ తేదీన డిపోల ఎదుట నిరహార దీక్షలు.
> నవంబర్ 07వ తేదీన ఆర్టీసీ కార్మికుల, రాజకీయ పార్టీల కుటుంబసభ్యులతో డిపోల ఎదుట దీక్షలు.
> నవంబర్ 08వ తేదీన చలో ట్యాంక్ బండ్ సన్నాహాక కార్యక్రమం.
> నవంబర్ 09వ తేదీన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం.

అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. నవంబర్ 02వ తేదీకి 29వ రోజుకు చేరుకుంది. శనివారం తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. ప్రధానంగా ఆర్టీసీ అంశంపై చర్చించనున్నారు. ఇందులో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నవంబర్ 07వ తేదీన జరిగే విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. 
Read More : కేంద్రం రంగంలోకి దిగుతుందా : ఢిల్లీకి తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారం