బర్త్ డే సెలబ్రేషన్స్ తర్వాత బీజేపీ కార్యకర్త హత్య.. మత విద్వేషాలే చంపేశాయంటోన్న ఫ్యామిలీ

బర్త్ డే సెలబ్రేషన్స్ తర్వాత బీజేపీ కార్యకర్త హత్య.. మత విద్వేషాలే చంపేశాయంటోన్న ఫ్యామిలీ

Murder

BJP Worker Murder: బర్త్ డే పార్టీలో జరిగిన వాదనలో 25సంవత్సరాల బీజేపీ కార్యకర్తను కత్తితో పొడిచి చంపేశారు. రోహిత్ శర్మ అలియాస్ రింకూ శర్మ అనే వ్యక్తిపై మతాంతర విద్వేషాలే ప్రాణం తీశాయని.. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఆరోపణను కొట్టిపారేస్తున్నారు. నిందితులు నశీరుద్దీన్, ఇస్లాం, మెహతాబ్, జహీద్, తాజుద్దీన్ లను గురువారం హత్య కేసు కింద బుక్ చేసి కేసు ఫైల్ చేశారు.

రింకూ శర్మ ఇంటి దగ్గరల్లో ఉండే స్నేహితుడు బాబు బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఢిల్లీలోని మంగోల్పూరీలో దగ్గరి ప్రాంతంలోనే ఉండటంతో రింకూతో పాటు నిందితులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్లంతా చాలాకాలంగా తెలిసిన వారే. అక్కడ ఓ విషయంపై వాదన మొదలై పార్టీ చెడిపోవడంతో రింకూ ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ఐదుగురు అతణ్ని ఫాలో అయి వెనుక నుంచి కత్తితో పొడిచి హత్య చేశారు.

ఇంటికి సమీపంలో ఉన్న ఒక సీసీ కెమెరాలో లాటీలు, కర్రలతో దాడి చేసినట్లుగా కనిపిస్తుంది. బర్త్ డే పార్టీలో గొడవ మొదలైనప్పటి క్షణం నుంచి ఎలా జరిగిందో కూలంకుషగా విచారిస్తున్నాం. అని పోలీసులు అంటున్నారు.

రింకూ శర్మ కుటుంబం మాత్రం.. అయోధ్యలో రామ మందిరం కోసం గతేడాది ర్యాలీ నిర్వహించాడని.. ప్రస్తుతం దానికి సంబంధించే విరాళాలు కూడా సేకరిస్తున్నాడని అంటున్నారు. అతను బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ లో కూడా పనిచేస్తున్నాడు. అతని సోదరుడేమో భజరంగ్ దళ్ లో కూడా సభ్యుడేనని చెప్తున్నారు.

ఆగష్టు 5న అయోధ్య రామమందిరం గురించి ర్యాలీ నిర్వహించాం. ఆ సమయంలోనే వేధింపులు జరిగాయి. జై శ్రీరామ్ అనే నినాదం వారికి నచ్చలేదట. అతణ్ని హత్యే చేస్తున్న క్షణంలో కూడా నా కొడుకు జై శ్రీరామ్ అనే అన్నాడు. అక్కడ 30 నుంచి 40మంది వరకూ లాఠీలు, కర్రలు, కత్తులతో నిల్చొన్నారని మృతుడి తల్లి చెప్తున్నారు.

ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ ఆదేశ్ గుప్తా కుటుంబాన్ని కలిసి.. ఆర్థిక సహాయంతో పాటు మరే అవసరమైనా తామున్నామని హామీ ఇచ్చారు. ఈ హత్యకు మతపరమైన రంగు కావాలనే పూస్తున్నారంటూ ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ‘ఘటనను తప్పదోవ పట్టించడం చాలా తప్పు’ అని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుదన్షు ధామా అంటున్నారు.