ఫ్రీడమ్ 251 మొబైల్ ఫౌండర్ అరెస్ట్, చెల్లని చెక్కులతో రూ.200కోట్ల మోసం

ఫ్రీడమ్ 251 మొబైల్ ఫౌండర్ అరెస్ట్, చెల్లని చెక్కులతో రూ.200కోట్ల మోసం

Dry Fruit: రింగింగ్ బెల్స్ ఫౌండర్ మోహిత్ గోయెల్.. కంపెనీ ప్రపంచంలోనే చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251ను ఆఫర్ చేసిన యజమానిని నోయిండా పోలీసులు అరెస్టు చేశారు. డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్న మోహిత్ రూ.200కోట్లు మోసం చేసినట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. గోయెల్ మరో ఐదుగురితో కలిసి డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. గోయెల్ మరో ఐదుగురితో కలిసి దుబాయ్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ హబ్ నేతృత్వంలో వ్యాపారం చేస్తున్నాడు. నోయిడా సెక్టార్ 62లో ఈ కంపెనీ ఆఫీసు ఉంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి కంప్లైట్లు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతణ్ని అరెస్టు చేశారు.

ఆ వ్యక్తి దేశవ్యాప్తంగా నార్మల్ మార్కెట్ రేటు కంటే.. ఎక్కువ ఖరీదుకు డ్రై ఫ్రూట్స్‌ను మార్కెట్ ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తుండేవాడు. అలా అభిమానం సంపాదించుకున్న వ్యక్తి.. నెట్ బ్యాంకింగ్ ద్వారా 40శాతం పేమెంట్ ను అడ్వాన్స్ కింద ఇచ్చాడు. మిగతా పేమెంట్ చెక్ ల రూపంలో ఇస్తానంటే అంతా నమ్మేశారు. చెక్ లను తీసుకెళ్లి బ్యాంకుల్లో వేశాక అవి బౌన్స్ అయ్యేసరికి తెలిసింది అసలు నిజం.

తమ పేమెంట్ పూర్తిగా ఇవ్వకపోగా.. ఆ డ్రై ఫ్రూట్స్ ను ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడని తెలుసుకున్నారు. బాధితుల్లో ఒకరైన ఓం ప్రకాశ్ జాంగిడ్ అనే వ్యక్తి చేసిన కంప్లైంట్ మేరకు నోయిడా పోలీసులు అరెస్టు చేశారు.

ఆడితో పాటు రెండు కార్లను 60కేజీల డ్రై ఫ్రూట్స్, కొన్ని డాక్యుమెంట్లతో పాటు వెంటనే రికవరీ చేశారు. కంపెనీ నిర్వహిస్తున్న సుమిత్ యాదవ్, రాజీవ్ కుమార్, ప్రవీణ్ సింగ్ సిర్వాన్ లకు కూడా ఇందులో భాగముందని తెలిసి వారిని కూడా అరెస్టు చేశారు.