జాతీయ సంక్షోభ సమయంలో మ్యూట్ ప్రేక్షకులుగా ఉండలేం : సుప్రీంకోర్ట్

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరత, ఇతర సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి మీ జాతీయ ప్రణాళిక ఏమిటి? అని కోర్టు కేంద్రాన్ని అడిగింది..

జాతీయ సంక్షోభ సమయంలో మ్యూట్ ప్రేక్షకులుగా ఉండలేం : సుప్రీంకోర్ట్

Covid 19 Suo Motu Case

COVID-19 Suo Motu Case : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరత, ఇతర సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి మీ జాతీయ ప్రణాళిక ఏమిటి? అని కోర్టు కేంద్రాన్ని అడిగింది.. ఈ సమయంలో ప్రజల ప్రాణాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని విచారణ ప్రారంభంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అవసరమైనప్పుడు తాము జోక్యం చేసుకుంటామని తెలిపింది.. జాతీయ విపత్తు సమయంలో జడ్జీలుగా ఉన్న తాము మ్యూట్ ప్రేక్షకులుగా ఉండలేమని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో హైకోర్టులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉందని అభిప్రాయపడింది.

దీనిపై కేంద్రానికి చెందిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ఈ అంశంపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో పనిచేస్తోందని, సమస్యలను తొలగించడానికి ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. కాగా కరోనా సమయంలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, పడకలు, వ్యాక్సిన్ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ సమస్యను లేవనెత్తింది.

గత విచారణలో, జాతీయ ప్రణాళిక ఏంటని కోర్టు కేంద్రాన్ని అడిగింది. ఈ కేసును జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ డి.వై.చంద్రచుడ్, జస్టిస్ ఎల్. నాగేశ్వర్ ధర్మాసనం విచారిస్తోంది. సీనియర్ అడ్వకేట్ మరియు మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వేను అమికస్ క్యూరీగా కోర్టు నియమించినప్పటికీ ఆయన ఈ కేసు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.