గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో ‘గాడ్ బ్లెస్ యూ’ హిందీలో ‘అస్సలాం అలైకుమ్’

గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో ‘గాడ్ బ్లెస్ యూ’ హిందీలో ‘అస్సలాం అలైకుమ్’

Google translate: గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో చూపించిన అర్థానికి పెనుదుమారమే రేగింది. ఆదివారం God Bless You అనే వాక్యానికి హిందీలో అనువాదం अस्सलामु अलैकुम అర్థం వస్తుందంటూ.. చూపించింది. నిజానికి ఆ వ్యాక్యానికి హిందీలో भगवान आपका भला करें అని చూపించాలట. ఈ ఎర్రర్ ను ట్విట్టర్ పసిగట్టేసింది.

దానిని నెటిజన్లు ట్వీట్ చేస్తుండటంతో వెంటనే తప్పు సరిదిద్దుకున్న గూగుల్.. ఫిక్స్ చేసింది. వారి ఫీడ్ బ్యాక్ పంపిన తర్వాత గూగుల్ సరిచేసిందని ఐకమత్యాన్ని కాపాడిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ముందు వచ్చిన అర్థాన్ని మార్చిన తర్వాతి పదాన్ని పోస్టు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మెషీన్ ట్రాన్స్‌లేషన్ కోసం న్యూరల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. ఇలా జరుగుతుంది. గూగుల్ ట్రాన్స్ లేట్ మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిస్టమ్ గా మారిపోయింది. మల్టిపుల్ లాంగ్వేజెస్ కు ప్రాంతీయ భాషల్లో అర్థం చెప్పేందుకు ఆటోమేటిక్ గా చెప్పేలా ప్రిపేర్ చేసేశారు.

గూగుల్ ట్రాన్స్ లేటర్ వచ్చిన తొలినాళ్లలో ఇలా ఉండేది కాదు. స్టాటిక్ ట్రాన్స్ లేషన్ మాత్రమే అందుబాటులో ఉండగా.. అందులో వ్యాక్యాలను ముందుగా ఉన్న వాటితో పోల్చుకుని అవుట్‌పుట్ ఇచ్చేది. ఆ పదాలు అంతగా కచ్చితంగా ఉండటం లేదని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను వాడటం మొదలుపెట్టారు.